రాష్ట్రీయం

యాథాద్రి ఘటనలపై అఖిలపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి * పల్లెపల్లెకూ మోదీ పథకాలు: డాక్టర్ లక్ష్మణ్
హైదరాబాద్, ఆగస్టు 8: రెండో తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్టలో అసాంఘిక , అమానవీయ ఘటనలు బయటకు రావడం సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాడు ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ పసిపిల్లలను ఈ రొంపిలోకి దింపి వ్యభిచారం చేయించడం క్షమించరాని నేరమని అన్నారు. దళారుల నుండి పసిపిల్లలను కొనుగోలుచేసినట్టు వార్తలు వస్తున్నాయని, దేశంలోనే చురుకుగా ఉన్న తెలంగాణ పోలీసు వ్యవస్థ ఈ ఘటనలను ఎందుకు అదుపుచేయలేకపోయిందని నిలదీశారు. షీ టీమ్స్ గురించి ఇంతగా ప్రచారం చేసే ప్రభుత్వం యాదాద్రి ఘటనలను ఎందుకు పట్టించుకోలేదని కిషన్‌రెడ్డి అన్నారు. ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ముఠాలు వ్యాపారం చేస్తున్నాయని చెప్పారు. 2015లో చిన్న పిల్లల అక్రమ రవాణా కేసు సికింద్రాబాద్‌లో నమోదైందని, అరెస్టయిన శంకర్, యాదగిరిలను వదిలిపెట్టారని, 2283 చిన్నారులు తెలంగాణలో కనిపించకుండా పోయారని, ఇంకా 912 మంది ఆచూకీ లభించలేదని, ప్రభఉత్వం దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిలదీశారు. కిడ్నాప్, అపహరణ కేసులను తూతూ మంత్రంగా వదిలేస్తున్నారని, యాదగిరిగుట్టలోనే కాదు, ఇంకా అనేక చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, స్వచ్ఛంద సంస్థలు, సేవాశ్రమాలు పేరుతో కూడా జరుగుతున్నాయని చెప్పారు. పట్టణాల్లో, నగరాల్లో కొత్త కాలనీల్లో ఇలాంటివి అనేకం జరుగుతున్నాయని రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి సంఘటనల మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2017 జూలై 17న సీఎం ఎస్సారెస్పీ కింద లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని, కాళేశ్వరం అయిపోతుందని, చెరువులు, కుంటలకు నీళ్లు అందిస్తామని , నీళ్ల లభ్యత ఉందని , ఎస్సారెస్పీ కింద రైతుకు నీరు ఇవ్వకపోతే పాపం చేసినట్టేనని సీఎం అన్నారని మరి ఇపుడు రైతులు నీళ్ల కోసం రోడ్లు ఎక్కారని అన్నారు. రోడ్డెక్కిన రైతులు అంతా భూ నిర్వాసితులే అయినా జాలి లేదని చెప్పారు. రాష్ట్రంలో రైతుకు సాగునీరు అందించకపోతే పాపం అన్న కేసీఆర్ ఎస్సారెస్పీ రైతులకు ఎందుకు నీళ్లు విడుదలచేయడం లేదని అన్నారు. నీళ్లు అడిగితే నిర్బంధించి అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.

పల్లెపల్లెకూ మోడీ పథకాలు: డాక్టర్ కే లక్ష్మణ్
మోడీ ప్రభుత్వం రైతులకోసం అనేక పథకాలను అమలుచేస్తోందని, ఆ పథకాలను పల్లెపల్లెకూ తీసుకుపోతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ చెప్పారు. బుధవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ వ్యవసాయం అంటే దండగ కాదు, పండగలా చేసిన ఘనత నరేంద్రమోదీదేనని అన్నారు. వరి, పత్తి పంటలకు మద్దతు ధర పెంచారని, పల్లెపల్లెకూ బీజేపీ రైతులకు చేస్తున్న అభివృద్ధి పథకాలు చేరువయ్యేలా చూస్తున్నారని అన్నారు. రాష్ట్రప్రభుత్వం రైతులకు చేస్తున్న ద్రోహంపైనా, కేంద్ర ప్రభుత్వం రైతులకు అమలుచేస్తున్న వివిధ పథకాల ప్రచారం కోసం ఆగస్టు 17 నుండి మండల స్థాయిలో కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కిసాన్ మోర్చ రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.