రాష్ట్రీయం

ట్రిపుల్‌ఐటీలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ కోర్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 8: బ్లాక్ చెయిన్ టెక్నాలజీస్-సొల్యూషన్స్‌లో హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ట్యాలెంట్ స్ప్రింట్ సహకారంతో అడ్వాన్స్‌డ్ సర్ట్ఫికేట్ ప్రోగ్రాంను ప్రారంభించింది. ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్- మెషిన్ లెర్నింగ్‌పై ఇంతకు ముందు ప్రారంభించిన ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంకు కొనసాగింపుగా దీనిని ప్రారంభించినట్టు ట్రిపుల్‌ఐటీ హెచ్ డైరెక్టర్ డాక్టర్ పీజే నారాయణ్ తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగాంను ప్రారంభించిన ఆరు నెలల కాలంలోనే 800 మందికి పైగా విద్యార్థులు ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రోగ్రాంలో చేరారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ చెయిన్ నిపుణులకు 700 శాతం పైగా డిమాండ్ పెరిగిందని అన్నారు. రిప్పల్‌కు చెందిన యూనివర్శిటీ బ్లాక్ చెయిన్ రీసెర్చి ఇనిషియేటివ్ కార్యక్రమానికి ప్రిన్సిటన్ యూనివర్శిటీ, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , యూనివర్శిటీ ఆఫ్ పెన్సల్వేనియా , యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ యూనివర్శిటీల భాగస్వామ్యంలో ట్రిపుల్‌ఐటీ కూడా ఉందని అన్నారు.
ఫైన్ ఆర్ట్సు, డిజైన్ కోర్సులకు సర్ట్ఫికేట్ల పరిశీలన
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ , ఫైన్ ఆర్ట్సు విశ్వవిద్యాలయంలోని ఫైన్ ఆర్ట్సు, డిజైన్ కోర్సుల్లో అడ్మిషన్లకు 9వ తేదీ నుండి సర్ట్ఫికేట్ల పరిశీలన మొదలవుతుందని అడ్మిషన్ల కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కే సుందర్ కుమార్ తెలిపారు. 9, 10 తేదీల్లో ఫైన్ ఆర్ట్సు కోర్సులకు, 11 తేదీన ఫోటోగ్రఫీ కోర్సునకు, 12వ తేదీన డిజైన్ కోర్సులకు, 13వ తేదీన ఇతర రాష్ట్రాల విద్యార్థులకు వెబ్ బేస్డ్ సర్ట్ఫికేట్ల పరిశీలన జరుగుతుందని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు వర్శిటీ వెబ్ పోర్టల్‌ను సందర్శించాలని ఆయన సూచించారు.