రాష్ట్రీయం

సమాజం క్షేమానికి వేదాధ్యయనం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వేదాధ్యయనం సమాజ సంక్షేమం కోసం, వేదాల పరిరక్షణకోసం జరగాలని త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వేర్వేరు వేద విద్యాలయాలకు చెందిన విద్యార్థులకు హైదరాబాద్ సమీపంలోని ‘జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ’ (జీవా) లో నిర్వహిస్తున్న మూడురోజుల వేద పరీక్షలను బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అహోబిల జీయర్, దేవనాథ జీయర్, ‘జీవా రీసర్చ్ అండ్ పబ్లికేషన్స్’ డైరెక్టర్ డాక్టర్ ఎస్.వీ. రంగరామానుజాచార్యులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ మాట్లాడుతూ, కొంత మంది వేదాధ్యయనం తర్వాత ఈ విద్యను డబ్బు సంపాదన కోసం వాడుతున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు. వేదాధ్యయనం పవిత్రమైందని, దీనికి డబ్బుతో ముడిపెట్టవద్దని హితవు చెప్పారు. వేదాల రక్షణకు వేదపండితులు పాటుపడితే సమాజమే వారి వద్దకు వస్తుందని సూచించారు. వేదాల పరిరక్షణకు డాక్టర్ జే. రామేశ్వర్‌రావు (మై హోం అధినేత) చేయూత ఇస్తున్నారన్నారు. 1131 వేద శాఖలు ఉండగా, వీటిలో 11 మాత్రమే మనకు లభ్యంగా ఉన్నాయని వివరించారు. జర్మనీతో పాటు ఇతర విదేశాల్లోని గ్రంథాలయాల్లో వేదపుస్తకాలు ఉన్నాయని, వీటిని ఉపయోగించడం వారికి తెలియడం లేదన్నారు. వేదాల పరిరక్షణకు ప్రభుత్వం ముందుకు రావలసి ఉందన్నారు.
అవసరం లేని చారిత్రక అంశాలకోసం ప్రభుత్వం లక్షలాది రూపాయలు వ్యయం చేస్తోందని రంగరామానుజాచార్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వేదాల కోసం ప్రభుత్వం శ్రద్ద వహించాల్సి ఉందని, అవసరమై నిధులు సమకూర్చాలని సూచించారు. వేదాలపై పరిశోధనకు ప్రభుత్వం నడుం కట్టాలని కోరారు.
ఋగ్వేదం, యజుర్వేదం, అధర్వవేదం, మైత్రాయిణి తదితర అంశాల్లో పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ప్రారంభమైన పరీక్షలు శుక్రవారంతో ముగుస్తాయి.