రాష్ట్రీయం

నదీ పరివాహక ప్రాంతాల్లో విద్యుత్ వినియోగం పైపైకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 8: తెలంగాణలోప్రవహిస్తున్న కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతల్లో రైతులు 24 గంటలు విద్యుత్‌ను వినియోగిస్తున్నందున విద్యుత్ అమాంతంగా పైపైకి ఎగబాకిందని ట్రాన్సకో అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో రుతుపవణాల గమనంలో పురోగతి లేనందున వర్షాలు తక్కువ శాతం నమోదు అయ్యింది. వాతావరణం చల్లబడడంతో పట్టణాల్లో విద్యుత్ వినియోగం తగ్గింది. అయితే రూరల్ ప్రాంతల్లో రైతాంగం ఎక్కువగా పంట పొలాలకు నీరు అవసం ఉన్నందున విద్యుత్‌ను అధికంగా వినియోగిస్తున్నారు. గత వారం వాతావరణం పొడిపొడిగా ఉన్నందున అన్ని విభాగాల్లో విద్యుత్ వినియోగం ఘననీయంగా పెరగడంతో జూలై 31వ తేదీన దాదాపు 10,429 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. దక్షణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అత్యధికంగా 25 మిలియన్ల యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి బుధవారం రికార్డ్ సృష్టించింది. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తమ పరిధిలో ఉన్న 12లక్షల పంపుసెట్లకు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 52 లక్షల విద్యుత్ గృహ వినియోగదారులు ఉన్నారు. జంటనగరాల్లో కొంత వాతావరణం చల్లబడడంతో విద్యుత్ వినియోగం తగ్గిందని చెబుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాల్లో అత్యధికంగా 24 మిలయన్ల యూనిట్లు విద్యుత్ వినియోగం మంగళవారం నమోదు అయ్యింది. గత మార్చి 6వ తేదీ నుంచి రోజురోజుకు విద్యుత్ వాడకం పెరుగుతోందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. విద్యుత్ కొరత లేదని అడిగినంత విద్యుత్‌ను ఇవ్వడానికి తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వరరెడ్డి స్పష్టం చేశారు.