రాష్ట్రీయం

అమరావతి అభివృద్ధిలో జపాన్ భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 8: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పెట్టుబడులకు జపాన్ ముందుకొచ్చింది. ఇందు లో భాగంగా జపాన్ రాయబారి బుధవారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సీఎం నివాసంలో భేటీ అయ్యారు. జపాన్ రాయబారి కెంజి హిరమట్సు, ప్రతినిధుల బృందం అమరావతిలో అపారమైన అవకాశాల గురించి చర్చించారు. విజ్ఞానం పెంచే సంస్థలను ఏర్పాటుచేస్తే ఉపాధి, పెట్టుబడులు మెరుగుపడతాయని, అందుకు అవసరమైన వనరులు నవ్యాంధ్రలో ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్, రవాణాకు సంబంధించిన ఆధ్యయనం, నవంబర్ 2018 నాటికి అందజేయనున్న నివేదిక గురించి అడిగి తెలుసుకున్నారు. అమరావతిలో డేటాసెంటర్, విపత్తుల నిరోధక వ్యవస్థ, విజయవాడలో ట్రాఫిక్ నియంత్రణ, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించి ఐదుగురు సభ్యులతో కూడిన జపాన్ ప్రతినిధుల బృందం స్పష్టమైన ప్రతిపాదనలను సమర్పించింది. సరిగ్గా మూడేళ్ల క్రితం జపాన్, ఏడాది క్రితం చైనా పర్యటనలో జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో) ప్రతినిధులతో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏపీలో పెట్టుబడులకు జపాన్‌కు చెందిన అనేక సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. ఇప్పటికే ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ అధికారులు పలు దఫాలుగా సమావేశమై చర్చలు జరుపుతున్నారని తెలిపారు. సీఆర్డీఏ సహకారంతో రాజధాని అమరావతిలో 1000 చదరపుమీటర్ల విస్తీర్ణంలో హైమన్ ఫ్యూచర్ పెవిలియన్‌ను అభివృద్ధి చేసేందుకు కుని ఉమి అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ ముందుకొచ్చింది. రాజధాని ప్రాంతంలో గృహ నిర్మాణం పట్ల జపాన్ ఆసక్తి చూపుతోంది. ఆహారశుద్ధి యూనిట్లు, పరస్పర సాంకేతిక సహకారాలకు సంసిద్ధత వ్యక్తం చేసింది. త్వరలోనే విశ్వవిద్యాలయాల్లో జపాన్ భాషను కూడా ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బౌద్ధ పర్యాటకంలో జపాన్‌కు ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో సారూప్యత ఉందని ఇరువురు ఈ సందర్భంగా సమాలోచనలు చేశారు. అమరావతి రెండవ టోక్యోగా అభివృద్ధి చెందాలని గతం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్, జపాన్ అభిలషిస్తున్నట్టు ముఖ్యమంత్రి వివరించారు. ఆ దిశగా అభివృద్ధికి బాటలు వేయాలని, జపాన్ సహాయ సహకారాలు ఇందుకు అవసరమని కోరారు.