రాష్ట్రీయం

సంతోషానికి ఆంధ్రా చిరునామా కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 8: సంతోషమే సగం బలమని, సంతోషానికి మన రాష్ట్రం చిరునామా కావాలని, గ్రామదర్శిని ఓ పవిత్ర కార్యక్రమంగా భావించి అధికారులు అంకితభావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. మంగళగిరి సికె కనె్వన్షన్‌లో బుధవారం రాష్టస్థ్రాయి గ్రామదర్శిని నోడల్ అధికారుల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సీఎంగా పనిచేసే అవకాశం నాకు వచ్చిం ది.. అధికారిగా పనిచేసే అవకాశం మీకు దక్కింది.. ప్రజల ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుందామని హితవు పలికారు. మనకోసం మనం బతకడం ఒక ఎత్తయితే సమాజం కోసం మనం బతకడం మరో ఎత్తు.. వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజాభివృద్ధికి పాటుపడాలని ఉద్ఘాటించారు. ప్రతి గ్రామం ఆకర్షణీయంగా రూపుదిద్దుకోవాలి..గ్రామ పర్యాటకం అభివృద్ధి చెందాలన్నారు. పల్లెల్ని సందర్శించేందుకు పర్యాటకులు పోటీపడాలని అభిలషించారు. వార్డులలో పరిశుభ్రత, పచ్చదనం పెంచాలని సూచించారు. వౌలిక సదుపాయాల కల్పనకు నరేగా కింద రూ 12వేల 184 కోట్లు ఖర్చుచేశామని, రూ 4550 కోట్లతో 18వేల 857 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించామని వివరించారు. మరో 1547 కోట్ల రూపాయలతో 6.57 లక్షల పంటకుంటలు, 182 కోట్లతో 2790 గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించామని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు అవతరణ దినోత్సవాలు ఉన్నాయి.. ఒక్క మన రాష్ట్రానికే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు కారణం ఆరు దశాబ్దాల కాలం ఆటుపోట్లే అన్నారు. కట్టుబట్టలతో నడిరోడ్డుపైకి నెట్టారు.. అయినా పట్టుదలతో కసిగా పోరాడుతున్నాం.. పునాదుల నుంచి రాష్ట్రాన్ని నిర్మించుకుంటున్నాం.. నవ నిర్మాణదీక్ష చేపట్టాం.. మహాసంకల్పం తీసుకున్నాం.. ఏరువాక, జలసిరికి హారతితో పాటు ప్రస్తుతం గ్రామదర్శిని, గ్రామ వికాసం కార్యక్రమాలనేకం చేపట్టామన్నారు. నూతన రాష్ట్ర నిర్మాణంలో అధికార యంత్రాంగానిదే కీలకభూమిక అన్నారు. అందుకే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామన్నారు. ఒక జాతీయ పార్టీ అడ్డగోలు విభజనతో అన్యాయం చేసింది..మరో జాతీయ పార్టీ నమ్మకద్రోహానికి పాల్పడింది.. మన ఎంపీలు హక్కుల కోసం పోరాడుతున్నారు.. రాష్ట్రం కోసం ఓ ప్రాంతీయ పార్టీ అవిశ్వాసం పెట్టడం ఓ చరిత్రగా అభివర్ణించారు. దేశం మొత్తంగా మన హక్కుల కోసం వివిధ పార్టీలు మద్దతిచ్చాయి.. విభజన చట్టంలో అంశాలన్నీ అమలుచేయాలని ఒత్తిడి చేశాయన్నారు. వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన నిధులు వెనక్కు తీసుకోవటం దారుణమన్నారు. బాలారిష్టాలను అధిగమించి 15 వందల రోజుల పాలన పూర్తిచేసుకున్నాం..దేశంలోనే మన వృద్ధిరేటులో ముందున్నామని చెప్పారు. గత నాలుగేళ్లుగా 10.5 శాతం సగటు వృద్ధి సాధించామని తెలిపారు. తలసరి ఆదాయాన్ని రూ 50 వేల పెంచామని 92వేల 234 నుంచి లక్షా 42వేల 576కు చేరిందన్నారు. ఒక విజన్ రూపొందించుకుని లక్ష్యాలను సాధిస్తున్నామని అన్నారు. 2022 నాటికి దేశంలో3వ అగ్రగామి రాష్ట్రం కావాలని, తలసరి ఆదాయంలో రూ 2.95 లక్షలకు చెరాలని 2029 నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా రూ 9.65 లక్షల తలసరి ఆదాయం సాధించాలని తద్వారా 2050 నాటికల్లా ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా రూ కోటీ 67లక్షల తలసరి ఆదాయం పెంచేలా ప్రణాళిక రూపొందించామని వివరించారు. సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను సాధించాలని ఐక్యరాజ్య సమితి 2030 సంవత్సరాన్ని టార్గెట్‌గా ఎంచుకుంటే మన రాష్ట్రంలో 2022 నాటికే సాధించే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. జాతీయ స్థాయిలో వృద్ధిరేటు 2.2 శాతం ఉంటే మన రాష్ట్రంలో 11 శాతం ఉందన్నారు. వర్షాభావంలో కూడా వ్యవసాయ దిగుబడులు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాయలసీమను సస్యశ్యామలం చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇప్పటి వరకు 58 శాతం పోలవరం నిర్మాణాన్ని పూర్తిచేశామని, పురుషోత్తపట్నం ద్వారా ముందే పోలవరం ఫలితాలను రైతులకు అందిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో 29 ప్రాజెక్టులను ఐదేళ్లలో పూర్తిచేయాలనే ధ్యేయంతో ప్రభుత్వం ఉందన్నారు. పారిశ్రామిక, సేవా రంగాల్లో రాష్ట్రం వెనుకబడి ఉందని గత నాలుగేళ్లుగా చేపట్టిన కార్యాచరణతో గణనీయమైన అభివృద్ధి సాధించ గలిగామన్నారు. రాష్ట్రంలో రూ 50వేల కోట్లతో 19లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం..మరో ఐదు లక్షల ఇళ్లు అదనంగా నిర్మించాలని నిర్ణయించామన్నారు. గ్రామాల్లో రూ 6221కోట్లతో 5.91 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామన్నారు. పట్టణాల్లో మరో 6లక్షల గృహాల నిర్మాణం పురోగతిలో ఉందన్నారు. చంద్రన్న పెళ్లి కానుకలు, అన్న అమృతహస్తం, ఫించన్ల పెంపుదల, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. రాష్టవ్య్రాప్తంగా 24.65లక్షల మంది చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నాం..గిరి గోరుముద్దలకు రూ 23 కోట్లు, సబల పథకానికి రూ 40 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు. ఎన్టీఆర్ బేబీకిట్స్ 5.21 లక్షల మందికి అందజేశామన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు భోజన వసతి కల్పిస్తున్నామని, ప్రీ, పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల పంపిణీలో నూరుశాతం పారదర్శకంగా అందజేస్తున్నట్లు తెలిపారు. నోడల్ అధికారులు సాధికారమిత్రలకు శిక్షణ ఇచ్చి పనితీరు మెరుగు పరిచేందుకు పర్యవేక్షించాలని సూచించారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని గ్రామీణ యువతే డ్రోన్ కెమెరాతో డాక్యుమెంటరీలు తీయడం ఆకర్షించిందన్నారు. సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలన్నారు. గ్రామాభివృద్ధికి నోడల్ అధికారులు అంకితభావంతో పనిచేయాలని కోరారు.
సమావేశంలో రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, పత్తిపాటి పుల్లారావు, పితాని సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్, వివిధశాఖల ముఖ్యకార్యదర్శులు పూనం మాలకొండయ్య, జవహర్‌రెడ్డి, కరికాలవలవన్, ఉదయలక్ష్మి, అహ్మద్‌బాబు, రాజాంజనేయులు, సీఎంఒ కార్యదర్శులు గిరిజాశంకర్, రాజవౌళి తదితరులు పాల్గొన్నారు.