రాష్ట్రీయం

విశాఖ ఏజెన్సీలో నేడు బ్లాక్‌డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 8: విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్ తవ్వకాలు జరిపి, నాల్కో కంపెనీకి ఇవ్వాలన్న ఆలోచన ఉన్నట్టు కేంద్రం ప్రకటించడం విశాఖ ఏజెన్సీలో కలకలం రేపుతోంది. చాలాకాలంగా బాక్సైట్ తవ్వకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనం పాటించి, ఇప్పుడు మళ్లీ బాక్సైట్ వైపు దృష్టి మరల్చడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రపంచ ఆదివాసీ దినోవత్సవం సందర్భంగా గురువారం పాడేరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను బ్లాక్ డేగా పాటించాలని గిరిజన సంఘం పిలుపునిచ్చింది. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు జరిపే అవకాశాలున్నాయా? అని రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర గనుల శాఖ సహాయ మంత్రి పార్దీబాయ్ చౌదరి సమాధానం ఇస్తూ, విశాఖ ఏజెన్సీలోని జెర్రెల బ్లాక్-1, 2, 3పాటు, గూడెం కొత్తవీధిలోని బాక్సైట్ కొండల్లో తవ్వకాలు జరపడానికి 2017లోనే నాల్కో కంపెనీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకుందని తెలియచేశారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తవ్వకాలకు సంబంధించి జీవో జారీ చేసింది. ఆ తరువాత కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారం కోల్పోయింది. ఆ తరువాత వచ్చిన ఏన్డీయే, టీడీపీ ప్రభుత్వాలు తరువాత ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టాయి. 2004కి ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలు జరపబోమని తేల్చి చెప్పారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన యుపీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖరరెడ్డి సహకారంతో బాక్సైట్ తవ్వకాలపై అడుగులు ముందుకు వేసి రస్ ఆల్ ఖైమా సంస్థను ఇక్కడికి తీసుకువచ్చింది. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం రాచపల్లిలో అన్‌రాక్ కంపెనీని నెలకొల్పారు. సుమారు ఆరువేల కోట్లతో ఈ కర్మాగారాన్ని నిర్మించారు. బాక్సైట్ తవ్వకాలకు మార్గాన్ని సుగమం చేస్తున్న సమయంలో మావోయిస్ట్‌లు కూడా రంగంలోకి దిగి, తవ్వకాలను వ్యతిరేకించారు. బాక్సైట్ తవ్వకాలకు మద్దతు పలికినందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను కాల్చిచంపారు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఏజెన్సీని వదిలి మైదానప్రాంతాలకు వచ్చేశారు. దీంతో బాక్సైట్ తవ్వకాల అంశాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా పక్కన పెట్టింది. తాజాగా ఈ అంశం తెరమీదకు రావడంతో ఏజెన్సీలో మళ్లీ కలకలం మొదలైంది.
అయితే, బాక్సైట్ తవ్వకాల అంశం చాలా సున్నితమైనది. ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి అన్‌రాక్ సంస్థ అల్యూమినా కంపెనీని నిర్మించి, ముడిసరకు లేకపోవడంతో ఆ కర్మాగారం పూర్తిగా మూతపడిపోయింది. ఈ కంపెనీ నిర్మాణం కోసం అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఎకరాల భూమిని కూడా కేటాయించింది. భూములు ఇచ్చిన రైతులకు అన్‌రాక్‌లో ఉద్యోగాలు వస్తాయన్నారు. ఓ పక్క భూములు పోయి, ఉద్యోగాలూ రాకపోవడంతో అక్కడి రైతులు అలమటిస్తున్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలోని ఏజెన్సీలో టీడీపీ ఘోరంగా దెబ్బతింది. వచ్చే ఎన్నికల్లో వీటిలో కొన్ని స్థానాలనైనా దక్కించుకోవలసిన అవసరం టీడీపీకి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో బాక్సైట్‌పై చంద్రబాబు దూకుడుగా వెళ్లకపోవచ్చని విశే్లషకులు భావిస్తున్నారు. ఏజెన్సీ పర్యటనలో చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలపై ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.