రాష్ట్రీయం

నిరాశ పరుస్తున్న నైరుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 8: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా, ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. రాష్ట్రంలో సగటు వర్షపాతం కన్నా దాదాపు 16 శాతం తక్కువగా నమోదు కావడంతో ఆరు జిల్లాల్లో కరవుఛాయలు నెలకొన్నాయి. వర్షాలు లేక వివిధ పంట సాగు విస్తీర్ణం కూడా 42 శాతానికే పరిమితమయింది. రాష్ట్రంలో ఈ ఏడాది గతం కన్నా ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో ఈ ఏడాది ఎక్కువగా వర్షాలు కురుస్తాయని రైతాంగం, అధికార యంత్రాంగం సంతోష పడింది. అయితే రుతుపవనాలు ప్రవేశించిన తొలినాళ్లలో మినహా ఆశించిన స్థాయిలో రుతుపవనాల ప్రభావం లేదు. దీంతో రాష్ట్రంలో జూన్ 1 నుంచి బుధవారం వరకూ 283 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకూ 237 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. 16.4 శాతం మేర తక్కువ వర్షపాతం నమాదు కావడం గమనార్హం. కోస్తా జిల్లాల్లో 4.5 శాతం మేర, రాయలసీమ జిల్లాల్లో 47.9 శాతం మేర సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వరుసగా సాధారణ వర్షపాతం కంటే 24.7, 25.5, 3.2 శాతం మేర అధికంగా నమోదు కావడం విశేషం. కానీ మిగిలిన జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం కురిసింది. గుంటూరు జిల్లాల్లో 31.6, ప్రకాశం జిల్లాలో 51.4, నెల్లూరు జిల్లాలో 56.1, చిత్తూరు జిల్లాలో 44, కడప జిల్లాలో 63.9, అనంతపురం జిల్లాలో 40.7, కర్నూల్ జిల్లాలో 42.7 శాతం మేర తక్కువ వర్షపాతం నమోదు ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే అధికారికంగా 121 మండలాలను కరవు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజా వర్షాభావ పరిస్థితులను పరిశీలిస్తే, మరికొన్ని మండలాలను కూడా కరవు మండలాలుగా ప్రకటించాల్సి వస్తుంది. ఆరు జిల్లాల్లో వర్షాభావ ప్రభావం ఎక్కువగా ఉంది. వర్షాలు లేకపోవడంతో వివిధ పంటల సాగుపై కూడా ప్రభావం కనిపిస్తోంది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భూగర్భ జలాలు 20 మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. రాష్ట్రంలో ఖరీఫ్‌లో వివిధ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 39.53 లక్షల హెక్టార్లు కాగా, ఈ నెల 3 నాటికి 19.29 లక్షల హెక్టార్లలోనే పంటలను వేశారు. దీంతో పంటలను కేవలం 42 శాతం మేర సాగు చేశారు. బంగళాఖాతంలో అల్పపీడనం వంటివి ఏర్పడితే రుతుపవనాలు బలపడి వర్షం కురిసే వీలు ఉంటుంది.