రాష్ట్రీయం

ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రౌతులపూడి, ఆగస్టు 8: రానున్న రోజుల్లో ప్రజాసమస్యలన్నీ పూర్తిగా పరిష్కరిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర సాగిస్తున్న జగన్ బుధవారం రౌతులపూడి మండలంలో పాదయాత్ర కొనసాగించారు. వర్షం కారణంగా మధ్యాహ్నం 1.30 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు జగన్‌ను కలిసి కుడుంపాత్రుడుచెరువు మినీ ప్రాజెక్టు గా ఏర్పాటు చేసినట్టయితే సుమారు పది గ్రామాల ప్రజలు తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందని విన్నవించారు. అనంతరం గిడజాం గ్రామంలో జగన్‌కు భారీ స్వాగతం లభించింది. గ్రామంలో సమస్యలపై డ్వాక్రా మహిళలు వినతిపత్రాలు అందజేశారు. చంద్రబాబు నాయుడు కల్లబొల్లి హామీలతో డ్వాక్రా మహిళలను మోసం చేశారని, అదేవిధంగా రుణమాఫీ పేరుతో రైతులను అప్పులపాల్జేశారని, తమ సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని జగన్‌ను కోరారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మహిళలకు భరోసా ఇచ్చారు. గిడజాం గ్రామంలో అభిమానులు భారీ ఎత్తున తరలిరావడంతో సుమారు గంటన్నరపాటు ప్రజాసంకల్పయాత్ర సాగింది. అనంతరం ఎస్ అగ్రహారం గ్రామంలో యాత్రను ప్రారంభించారు. అశేష జనవాహిని మధ్య ప్రజాసంకల్పయాత్ర సాగింది. గ్రామంలో పలు సమస్యలపై వినతిపత్రాలను అందజేశారు. సాయంత్రం విరామ సమయానికి డీజే పురం, పారుపాక జంక్షన్‌లో యాత్రను ముగించారు. ఈ కార్యక్రమంలో జగన్ వెంట ప్రత్తిపాడు వైసీపీ కన్వీనర్ పర్వత పూర్ణచంద్రప్రసాద్, దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబు, పాముల రాజేశ్వరీదేవి, వాసిరెడ్డి జమీలు, మురళీరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎస్ అగ్రహారం, గిడజాం గ్రామాల్లో మహిళలు నేలపై చీరలు పరిచి జగన్‌ను నడిపించారు.