రాష్ట్రీయం

ప్రతి ఇంటికీ ‘కంటి వెలుగు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 8: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 15 న ప్రారంభిస్తున్న ‘కంటి వెలుగు’ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా పాల్గొనాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి పిలుపు ఇచ్చారు. పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల అధ్యక్షులు తప్పని సరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రజాప్రతినిధులందరికీ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలోని ప్రజలందరికీ కంటి పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు దృష్టిలోపం ఉన్నవారికి వెంటనే కళ్లద్దాలు, మందులు ఉచితంగా ఇస్తామన్నారు. అవసరమైన వారికి హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాలు, నగరాల్లోని కంటి దవాఖానాల్లో ఆపరేషన్లు చేయించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. చాలామంది ప్రజలు కంటి జబ్బులను నిర్లక్ష్యం చేస్తున్నారని, వైద్యపరీక్షలకు సౌకర్యం లేకపోవడం, కంటి వైద్యులు అందుబాటులో లేకపోవడం తదితర కారణాల వల్ల లక్షలాది మంది కంటి పరీక్షలు చేయించుకోవడం లేదన్నారు. అందుకే ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. అన్ని గ్రామాలతో పాటు పట్టణాల్లోని అన్ని డివిజన్లలో వైద్య పరీక్షల కోసం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కంటి పరీక్ష అవసరం అయినవారంతా ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు. కంటి వైద్య పరీక్షల గురించి తెలిసిన వారు తమ తోటి వారికి ఈ సమాచారం ఇవ్వాలని లక్ష్మారెడ్డి సూచించారు.