రాష్ట్రీయం

నేటినుంచి మహా సంప్రోక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 10: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహోసంప్రోక్షణకు శనివారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఆరు రోజులపాటు నిర్వహించనున్న ఈ మహా కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించే అన్ని రకాల ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ ఆరు రోజుల పాటు సమయాన్ని బట్టి రోజుకొక విధంగా పరిమిత సంఖ్యలో భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు.
ఇదిలా ఉండగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ మహాక్రతువుకు శనివారం రాత్రి 7 నుంచి 10గంటల వరకు అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా విష్వక్సేనులను ఊరేగింపుగా ఆలయానికి ఈశాన్య భాగంలో ఉన్న వసంత మండపానికి తీసుకువెళ్లి అక్కడ శాస్త్రోక్తంగా పుట్టమన్ను సేకరిస్తారు. దేవాలయాల్లో ఆలయంలోని మరమ్మతులను ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం పాఠకులకు విదితమే. ఇందుకోసం శ్రీవారి ఆలయంలో 28 హోమగుండాలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు ఆధ్వర్యంలో 44 మంది రుత్విక్కులు, 100 మంది వేదపండితులు, ధర్మగిరి వేదపాఠశాల నుంచి 20మంది వేద విద్యార్థులు ఈ మహాక్రతువులో పాల్గొంటారు. సోమ, మంగళ వారాల్లో విశేష హోమాలు జరుగుతాయి. మహాసంప్రోక్షణలో ఐదవరోజైన బుధవారం ఉదయం కైంకర్యాలు నిర్వహించిన అనంతరం మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట తరువాత గర్భాలయంలోని మూలవర్లకు 14 కలశాలతో మహాశాంతి తిరుమంజనం చేపడతారు. ఉత్సవ మూర్తులకు యాగశాలలోనే అభిషేకం నిర్వహిస్తారు.
గురువారం శ్రీవారి మూలమూర్తికి, విమాన గోపురానికి, ఉపాలయంలోని స్వామివారి విగ్రహాలకు, గోపురాలకు కుంభంలోని శక్తిని తిరిగి ఆవాహన చేస్తారు. అటు తరువాత ఆరాధన విశేష పూజలతో ఈ మహా క్రతువుముగుస్తుంది. అనంతరం రాత్రి మలయప్పస్వామి పెద్ద శేషవాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. అదేరోజు గరుడ పంచమి విశేష దినం కావడంతో ఆనాడు స్వామివారు గురువారం రాత్రి గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.