రాష్ట్రీయం

బీమాతో భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: పంద్రాగస్టు నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక రైతు బీమా పథకాన్ని పకడ్బందిగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రపంచంలోనే అతి పెద్ద జీవిత బీమా పథకంగా ప్రారంభం కానున్న రైతు బీమా పథకం తెలంగాణ రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఒక భరోసా అని సీఎం అన్నారు. రికార్డుల్లో ఉన్న అర్హుడైన రైతు ఏ కారణం చేతనైనా మరణిస్తే, జీవిత బీమా సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం పది రోజుల్లో రైతు కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు లభిస్తాయన్నారు. ఆ చెక్కును కుటుంబ సభ్యులకు చేరే విధంగా, యంత్రాంగాన్ని నియమించి పటిష్టమైన చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బీమా మొత్తం బాధ్యులకు చేరే క్రమంలో తలెత్తే బాలారిస్టాలు, నియమ నిబంధనల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి, గ్రామ కార్యదర్శిదేనని సీఎం స్పష్టం చేసారు. వీరు ఇరువురి సమన్వయంతో పని చేయాలని, అర్హులైన వారికి బీమా చెక్కును అందించడంలో వీరిద్దరిదే బాధ్యతని సీఎం కేసీఆర్ అన్నారు. మరణించిన రైతుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని 48 గంటల్లో అందజేయాల్సిన బాధ్యత స్థానిక గ్రామ కార్యదర్శిదేనన్నారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో రైతు బీమా పథకం అమలుపై సీఏం అధికారులతో సమీక్షించారు. రైతుకు బీమా సొమ్ము అందే క్రమంలో దశల వారిగా తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాటు చేయాల్సిన యంత్రాంగంపై అధికారులకు సీఏం వివరించారు. ‘దాదాపు రూ. 636 కోట్లతో 28 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రపంచంలోనే అతి పెద్ద జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నాం. గ్రామస్థాయిలో అర్హులైన రైతుల పైర్లు వివరాలు వ్యవసాయ విస్తరణాధికారి కంప్యూటర్‌లో అందుబాటులో ఉంచుకోవాలి. ఈ నెల 14 అర్ధరాత్రి నుంచే ఈ పథకం అమలులోకి రానున్నందున ఆ సమయం తర్వాత ఏ కారణం చేతనైనా అర్హుడైన రైతు మరణిస్తే, అతని కుటుంబానికి 5 లక్షల రుపాయలు నిర్ణీత సమయంలో పది రోజులలో అందజేయాలి’ అని అధికారులను సీఎం ఆదేశించారు.