రాష్ట్రీయం

రాహుల్ సభకు ససేమిరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటన, విద్యార్థులతో భేటీ కార్యక్రమం రద్దయ్యింది. రాహుల్ పర్యటనకు వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ససేమిరా అన్నారు. కాంగ్రెస్‌కు అనుబంధ విభాగమైన విద్యార్థి సంఘం చేసిన విజ్ఞప్తిని వర్సిటీ జాయింట్ డైరెక్టర్ తోసిపుచ్చారు. దీంతో పలు విద్యార్థి సంఘాల నేతలు కోర్టును ఆశ్రయించే ఆలోచన చేస్తున్నారు. రాహుల్‌కు మద్దతుగా 17 విద్యార్థి సంఘాలు నిలిచాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. రాహుల్ ఉస్మానియా వర్సిటీకి వస్తారన్న వార్తలు రావడంతో వర్సిటీలోని విద్యార్థి సంఘాలు అనుకూల, వ్యతిరేకవర్గాలుగా చీలిపోయాయి. దీంతో అలజడి ఆరంభమైంది. ఇదిలాఉండగా వర్సిటీలో రాహుల్ పర్యటనకు అనుమతి నిరాకరించడంతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సీ కుంతియా ప్రత్యామ్నాయంగా సరూర్‌నగర్ స్టేడియంలో ‘యువజన గర్జన’ పేరిట సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం వారు స్టేడియంను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
సర్కారుకు భయమెందుకు?
అనంతరం గాంధీ భవన్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉస్మానియా వర్సిటీకి రాహుల్ వెళతానంటే ప్రభుత్వానికి భయం ఎందుకని ప్రశ్నించారు. ఆయన రాకను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన సర్కారును నిలదీశారు. 13న మధ్యాహ్నం 2.30 గంటలకు రాహుల్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారని, 14న ఉదయం కార్యకర్తలతో రాహుల్ ‘టెలి కాన్ఫరెన్స్’లో మాట్లాడుతారని ఉత్తమ్ చెప్పారు. శేరిలింగంపల్లిలో జరిగే సభలో రాహుల్
సీమాంధ్రుల సమస్యలపై ప్రత్యేకంగా మాట్లాడుతారని అన్నారు. తెలంగాణలో ఉన్న సీమాంధ్రులకు పార్టీలో పదవులు ఇస్తామని, వచ్చే ఎన్నికల్లో టికెట్లూ ఇస్తామని ఆయన తెలిపారు. రాహుల్ పర్యటన చారిత్రాత్మకం అవుతుందని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలను చులకనగా చూస్తున్నారని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అభయ హస్తం పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు.
13న రాహుల్..
ఈనెల 13న మధ్యాహ్నం 2.30 గంటలకు రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ 15 నిమిషాల పాటు పార్టీ నాయకులను, కార్యకర్తలను కలుసుకుంటారు. అనంతరం 3.15 గంటలకు శంషాబాద్‌లోని క్లాసిక్ కనె్వన్షన్ సెంటర్‌కు ప్రత్యేకంగా సిద్ధం చేసిన బస్సులో చేరుకుని మహిళా స్వయం సహాయక బృందాల సమావేశంలో పాల్గొంటారు. అక్కడి నుంచి సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ హైవే మీదుగా శేరిలింగంల్లిలో జరిగే బహిరంగ సభకు ప్రత్యేక బస్సులో చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 7.30 గంటలకు బేగంపేట, సోమాజీగూడలోని హరిత ప్లాజాకు చేరుకుని, రాత్రికి అక్కడే బస చేస్తారు.
14న టెలికాన్ఫరెన్స్..
14న ఉదయం 9 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల కమిటీలతో టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత 10.30 గంటల నుంచి గంట సేపు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఎడిటర్లతో ఇష్టాగోష్టిగా సమావేశమవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు యువ పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. భోజన విరామం తర్వాత 2.30 గంటలకు బస్సులో బయలుదేరి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కుకు చేరుకుని, అమర వీరులకు నివాళులర్పిస్తారు. అనంతరం 3.30 గంటలకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరి, అక్కడ బేగంబజార్‌లోని వర్తక వ్యాపారులతో సమావేశమై చర్చిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు సరూర్‌నగర్ స్టేడియంకు చేరుకుని విద్యార్థి, నిరుద్యోగ గర్జన బహిరంగ సభలో పాల్గొని 7 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని, ఢిల్లీకి బయలుదేరి వెళతారని పార్టీ ప్రకటించింది.
చిత్రం..సరూర్‌నగర్ స్టేడియాన్ని పరిశీలిస్తున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి