ఆంధ్రప్రదేశ్‌

ఆక్రమణల తొలగింపునకు అర్బన్‌లో కార్యాచరణ ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: అర్బన్ ప్రాంతాల్లో అదుపులేని అనధికార నిర్మాణాలతో ముంచుకొస్తున్న ముంపు ప్రమాదాలను నివారించడానికి పురపాలక శాఖ ఒక సీజన్ ముందుగానే అప్రమత్తమయ్యింది. వర్షాకాలంలో భారీ వర్షాల వల్ల ఏర్పడే ముంపు ప్రమాదాన్ని ముందుగానే ఎదుర్కోవడానికి పురపాలక శాఖ ప్రణాళికను సిద్ధంచేస్తోంది. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లోని మురికినీటి డ్రెయిన్లు ఆక్రమణలకు గురవటం వల్ల వర్షాకాలంలో వరద నీరు ఎలాంటి అవరోధాలు లేకుండా బయటకు వెళ్లే మార్గం ఉండటంలేదని, దీనివల్ల రాష్ట్రంలోని చాలా పట్టణాలు, నగరాలు వర్షాకాలంలో తరచూ ముంపునకు గురవుతున్నాయన్న విషయాన్ని పురపాలక శాఖ గుర్తించింది. ఇలాంటి ముంపును నివారించడానికి ముందుగానే కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకోవాలని ఆ శాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో డ్రెయిన్ల పరిస్థితి, ఆక్రమణలు గుర్తించడానికి ప్రత్యేక సర్వే కార్యక్రమాన్ని ఈ నెల 5నుండి ప్రారంభించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని ఇంజనీరింగ్, ప్రణాళికా విభాగం, రెవెన్యూ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందితో ఏర్పాటుచేసిన సర్వే బృందాలు వార్డుల వారీ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈనెల 15లోపు సర్వేను పూర్తిచేసి సిద్ధంగా ఉండాలని ముందుగానే కమిషనర్లను ఆదేశించిన పురపాలకశాఖ, త్వరలోనే ఆక్రమణలను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా దశాబ్దాల తరబడి అటు మున్సిపల్ అధికారులు ఆక్రమణలను పట్టించుకోకపోవటం, కాంక్రీట్ జంగిల్‌గా అర్బన్ ప్రాంతాలు మారిపోవటంతో భూమిలోకి వర్షపు నీరు ఇంకే పరిస్థితి ఉండటం లేదు. ఇప్పుడీ పరిస్థితిని చక్కదిద్దడానికి ముందుగా ఆక్రమణ తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. తరచూ ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, ఇప్పటి నుండే శాశ్వత ముంపు నివారణ ప్రణాళికను సిద్ధంచేయాలని కమిషనర్లను పురపాలకశాఖ ఆదేశించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ఆక్రమణలు, దుకాణాలు, ఇళ్లు తదితర కేటగిరీల్లో నివేదికలను రూపొందించాల్సిందిగా కమిషనర్లను పురపాలకశాఖ ఆదేశించింది. సర్వే బృందాలు ముందుగా ఎరుపు రంగు మార్కింగ్ ఇచ్చి, వివరాలను సిద్ధంచేస్తాయి. పురపాలకశాఖ నుండి ఆదేశాలు జారీ అయిన వెంటనే ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపడతారు. వీటితో పాటు డ్రెయిన్లు, ఇతర ప్రదేశాల్లో ఎలాబడితే అలా చెత్తను వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని ఆదేశించింది.