ఆంధ్రప్రదేశ్‌

పట్టణాల్లో తీరనున్న మంచినీటి కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: పట్టణ ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు 14వ ఆర్థిక సంఘం నిధులు మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులను జిల్లా పరిషత్ ద్వారా ఖర్చుచేయాలని ఆదేశించింది. 25 శాతం నిధులను మళ్లిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాపంచాయతీ అధికారులకు ఆదేశాలు అందాయి. రాష్ట్రంలో గత ఏడాది వరకు జరిగిన 13వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులో మొత్తం నిధుల్లో 70 శాతం గ్రామపంచాయతీలకు, 20 శాతం జిల్లా పరిషత్‌లకు, 10 శాతం మండల పరిషత్‌లకు కేటాయించేవారు. అయితే 14వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు ప్రారంభమైన ఈ ఏడాది నుంచి వందశాతం నిధులను నేరుగా గ్రామపంచాయతీలకు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిధులకు రాష్ట్రప్రభుత్వం 50 శాతం జత చేయవలసి ఉంటుంది. కేంద్రం తాజా నిర్ణయంతో వివిధ పథకాల నిర్వహణ, మరమ్మతుల విషయంలో జిల్లా పరిషత్, మండల పరిషత్‌లలో ఇబ్బందులు మొదలయ్యాయి. ముఖ్యంగా వేసవిలో తలెత్తే మంచినీటి సమస్య జఠిలంగా మారే పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో పలు గ్రామాలకు మంచినీరు సరఫరా చేసే సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు, బోర్ల నిర్వహణ విషయంలో గ్రామపంచాయతీలు వివిధ కారణాలతో నిధుల కేటాయింపునకు సుముఖత వ్యక్తం చేయకపోవటం, జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల వద్ద నిధులు లేకపోవటంతో మంచినీటి సమస్య జఠిలంగా మారింది. జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లా పరిషత్ సమావేశాల్లో ఈ సమస్యపై వాడీవేడీ జర్చలు జరిగాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సైతం వివిధ జిల్లాలకు చెందిన మంత్రులు నిధుల లేమి గురించి ప్రస్తావించారు. 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ, మరమ్మతుల కోసం జిల్లా పరిషత్‌ల ద్వారా ఖర్చు చేయాలని ఆదేశిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 14వ ఆర్థిక సంఘం నిధులు రెండవ విడతగా రాష్ట్రానికి రూ.461.24 కోట్ల విడుదలవగా అందులో రూ.143.16 కోట్లు రక్షిత మంచినీటి పథకాలకు ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. ఈ మొత్తంలో 25 శాతం నిధులు అంటే రూ. 35.79 కోట్లు సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ, మరమ్మతులకు మళ్లిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధులు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారికి అప్పగించాలని, జిల్లా పరిషత్ చైర్మన్, సిఇఓలు చైర్మన్, కన్వీనర్‌గా ఉండే కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీల పర్యవేక్షణలో సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ, మరమ్మతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని బోర్ల మరమ్మతులు, నిర్వహణ తతంగాన్ని మండల పరిషత్‌లు ఆర్థిక సంఘం నిధులతో నిర్వహించేవి. 13వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు వరకు ఒక బోరుకు రూ. 600లు చొప్పున మండల పంచాయతీలకు అందేవి. 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు నేరుగా గ్రామపంచాయతీలకు నిధులు కేటాయించటంతో ఏర్పడిన ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఒక బోరుకు రూ.వేయి చొప్పున గ్రామపంచాయతీలకు విడుదలైన నిధుల నుంచి తీసుకుని జిల్లాపరిషత్ ద్వారా మండల పరిషత్‌కు అందచేయాలని నిర్ణయించారు. ఈ విధంగా బోర్ల నిర్వహణ, మరమ్మతులకు రాష్ట్రంలోని 13 జిల్లాలకు రూ.17.31 కోట్లు కేటాయించారు. అనంతపురం జిల్లాకు అత్యధికంగా రూ.5.58 కోట్లు కేటాయించగా అత్యల్పంగా చిత్తూరు జిల్లాకు రూ. 26 లక్షలు మాత్రమే కేటాయించారు. తూర్పుగోదావరి జిల్లాకు రూ. 5.42 కోట్లు, కర్నూలుకు రూ.4.61 కోట్లు, ప్రకాశం జిల్లాకు రూ.3.99 కోట్లు, కృష్ణాకు రూ.2.72 కోట్లు, విజయనగరం జిల్లాకు రూ.2.25 కోట్లు, గుంటూరుకు రూ. 2.19 కోట్లు కేటాయించారు. శ్రీకాకుళం జిల్లాకు రూ.1.99 కోట్లు, నెల్లూరుకు రూ.1.91 కోట్లు, కడపకు రూ.1.83 కోట్లు , పశ్చిమ గోదావరికి రూ.1.79 కోట్లు, విశాఖకు రూ.1.26 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వేసవిలో మంచినీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు అవసరమైన నిధుల సమస్య తొలగినట్లేనని జిల్లా పరిషత్, మండల పరిషత్ అధికారులు అంటున్నారు. ప్రభుత్వం నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాలు నష్టపోయే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని నీటి పథకాలు, బోర్ల నిర్వహణ, మరమ్మతులకు 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ప్రత్యేకంగా కొన్నింటిని జడ్పీలు, మండల పరిషత్‌లకు మళ్లిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అశనిపాతంగా మారింది.