ఆంధ్రప్రదేశ్‌

రాజీవ్ స్వగృహపై రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షణలో విశాఖపట్నంలో చేపట్టిన ఇళ్ళ నిర్మాణంపై బిజెపి శాసనసభ్యుడు పి విష్ణుకుమార్ రాజు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మంత్రి మృణాళిని బదులిస్తూ ఆరు నెలల్లో కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని, దరఖాస్తు దారులకు సొమ్ము చెల్లిస్తున్నామని తెలిపారు.
తొలుత బిజెపి ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం ఎండాడలో రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారని, బ్యాంకుల నుంచి 1000 కోట్ల రూపాయలు సేకరించిన అప్పటి ఐఎఎస్ అధికారి ఈ నిధులను తెలంగాణకు తరలించారన్నారు. దీనివల్ల ఆంధ్ర రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ నిర్మాణాలు నిలచిపోయాయన్నారు. బిల్లులు చెల్లించనిపక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని కాంట్రాక్టర్లు ప్రకటించారన్నారు. దీనికి మంత్రి మృణాళిని బదులిస్తూ దరఖాస్తుతోపాటు వసూలు చేసిన రిజిస్ట్రేషన్ ఫీజును దరఖాస్తుదారులకు నిధుల లభ్యతను బట్టి చెల్లిస్తోందని, మిగిలిన మొత్తాన్ని ఆరు నెలల్లోపు చెల్లిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ కింద ఆంధ్రలో ఇండ్లకు కేవలం రూ.105 కోట్లను కేటాయించడం వల్ల సమస్య ఉత్పన్నమైందన్నారు.