రాష్ట్రీయం

శాస్త్రోక్తంగా క్షీరాధివాస తిరుమంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 15: తిరుమల శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణంలో భాగంగా నాలుగో రోజు బుధవారం ఉదయం శ్రీవారి మూలమూర్తికి ఇతర పరివార దేవతలకు క్షీరాధివాస తిరుమంజనం క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ సమయంలో విశ్వంలోని శక్తిని ఆవాహనం చేసేందుకు ఆధివాసం నిర్వహిస్తారు. ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహాలు అనంతమైన శక్తిని పొందుతాయి. ఇలాంటి విగ్రహరూపంలో ఉన్న దేవతలను దర్శించడం ద్వారా కోరిన కోర్కెలు తీరడంతోపాటు మానసిక శాంతి చేకూరుతుంది. శాస్త్రాల ప్రకారం ఆలయాల మూలమూర్తికి ప్రాణప్రతిష్ఠ సమయంలో క్షీరాధివాసం, జలాధివాసం, ఫలాధివాసం, ఛాయాధివాసం, ధాన్యాధివాసం, శయనాధివాసం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. శ్రీవారి మూలమూర్తిని పవిత్రమైన పాలతో అభిషేకం చేయడాన్ని క్షీరాధివాసం అంటారు.
అద్దంలోని గోపుర శిఖరాల ప్రతిబింబాలకు అభిషేకం
శ్రీవారి ఆలయంలో బుధవారం ఉదయం గోపురాల కళాశాలను అద్దంలో చూపి వాటి ప్రతిబింబాలకు అభిషేకం నిర్వహించారు. శ్రీ విమాన వేంకటేశ్వర స్వామి, శ్రీ గరుడాళ్వార్, శ్రీ వరదరాజస్వామి, శ్రీ భాష్యకారులు, శ్రీ యోగనరసింహస్వామివారికి, ధ్వజస్తంభం, శ్రీ బేడి ఆంజనేయస్వామివారి గోపురాల కలశాలను ఈవిధంగా పవిత్రమైన జలం, పాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు సుధా నారాయణ మూర్తి, తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.