రాష్ట్రీయం

మహనీయుల త్యాగాలు మరువలేనివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 15: మహనీయుల త్యాగాలు మరువలేనివని రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. వారి స్ఫూర్తితో భావి తరాల భవిష్యత్‌కు నేటితరం పూనుకోవాలని పిలుపునిచ్చారు. బ్రిటీష్ దాస్య శృంఖలాలను ఛేదించి జీవితాలను ఫణంగా పెట్టిన సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో బుధవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్ ఎన్‌ఎండి ఫరూక్ జాతీయ జెండా ఆవిష్కరించారు. తొలుత పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, శాసనమండలి సభ్యురాలు శమంతకమణి, కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
సచివాలయంలో...
ఏపీ సచివాలయంలో మువ్వనె్నల జెండా రెపరెపలాడింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి మన్మోహన్‌సింగ్ ఒకటో బ్లాక్ ఎదుట జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ కార్యదర్శి సత్యనారాయణ, జీఏడీ సంయుక్త కార్యదర్శి రామరాజు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద సీఎం కార్యదర్శి గిరిజాశంకర్ జాతీయ జెండాను ఎగురవేసి పోలీస్ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్‌తో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఇరిగేషన్, పాడిపరిశ్రమలు, పర్యాటక, నైపుణ్యాభివృద్ధి, సేవారంగ కార్యక్రమాలతో యువతకు ఉపాధి కల్పిస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ భద్రయ్య, సెక్యూరిటీ అధికారి స్వామి, సీఎంఓ సిబ్బంది పాల్గొన్నారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో...
విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి గిరిజాశంకర్ త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. సామాన్య ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించటంలో అంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాసరావు, సీఎస్‌ఒ చెన్నుపాటి భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.