ఆంధ్రప్రదేశ్‌

మెరిట్ ఆధారంగానే డాక్టర్ పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ల పోస్టులను మెరిట్ ఆధారంగానే భర్తీ చేస్తున్నామని వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడి తన అధికారిక నివాసంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. మెడిసిన్‌లో అభ్యర్థులకు వచ్చిన మార్కులతో పాటు, ఎంతకాలం క్రితం మెడిసిన్ పూర్తి చేశారో పరిగణనలోకి తీసుకుని, ఆ మేరకు మార్కులను కలిపి డాక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. వైద్యుల ఎంపికలో ఇంటర్వ్యూ ఏమీ ఉండదని, ఇంటర్వ్యూ ఉంటే పైరవీలకు అవకాశం లభిస్తుందని, అందువల్ల ఇంటర్వ్యూలను రద్దు చేశామన్నారు. ఎంపికైన డాక్టర్లను గిరిజన ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేస్తామన్నారు. ఇలా ఉండగా 200 మంది గైనకాలజిస్టులను కూడా నియమిస్తున్నామని, వీరిలో పిల్లల డాక్టర్లు, అనస్థీషియా డాక్టర్లు కూడా ఉంటారన్నారు. బోధనాసుపత్రుల్లో పనిచేసేందుకు వెయ్యి మంది నర్సులను నియమించాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. స్వచ్ఛ్భారత్ కింద ఆసుపత్రుల్లో ప్రత్యేక పాలసీని తీసుకువచ్చామని, కొంత మంది పాత కాంట్రాక్టర్లు కోర్టులో ఈ పాలసీని ఛాలెంజ్ చేశారన్నారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందని వివరించారు. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, చెత్తాచెదారాలను తొలగించేందుకు దేశంలో ఉత్తమమైన పాలసీని రూపొందించామని, ఈ విషయాన్ని కోర్టుకు తెలియచేశామన్నారు. ఎన్‌టిఆర్ వైద్య సేవకు 2015-16 లో 700 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, 2016-17 లో దీన్ని మరింత పెంచబోతున్నామని కామినేని తెలిపారు. 35 సంవత్సరాలు దాటిన వారందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా చేస్తామన్నారు. గర్భిణీలకు రెండు పర్యాయాలు అల్ట్రాసౌండ్ పరీక్షలు ఉచితంగా చేస్తామని, ప్రైవేట్‌గా అయితే ఈ పరీక్షలకు నాలుగువేల రూపాయలు వ్యయం అవుతాయని గుర్తు చేశారు. ప్రసవ సమయంలో తల్లీబిడ్డల మరణాలను వీలైనంత వరకు తగ్గించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. తల్లీబిడ్డల ఆసుపత్రులను పది ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఈ పథకం ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు.
ఎయిమ్స్ ఏర్పాటుకు మొత్తం 1618 కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసిందని, ఇందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 125 కోట్లను కేటాయించిందన్నారు. ఎంసిఐ నుండి అనుమతి రాగానే ఎయిమ్స్ పనిచేయడం ప్రారంభమవుతుందన్నారు.
ఆయుష్‌కు పెద్దపీట
కేంద్ర ప్రభుత్వం ఆయుష్ (్భరతీయ వైద్య విధాన వైద్యం) కు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ శాఖకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని కామినేని గుర్తు చేశారు. ఎపిలో కూడా ఆయుష్‌కు ప్రాధాన్యత ఇస్తామన్నారు.