ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీని ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్ధను ఆర్ధికంగా పటిష్ఠం చేయాలని వైకాపా ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కోరారు. మంగళవారం జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ కండక్టర్ల వ్యవస్ధను తొలగించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెయ్యి కోట్లను మంజూరు చేసి ఆర్టీసి నిలదొక్కుకునేందుకు చర్యలు తీసుకుందన్నారు. ఏపిఎస్ ఆర్టీసి కూడా ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బందికి నెలవారీ జీతాలు ఇవ్వలేని స్ధితిలో ఆర్టీసి లేదన్నారు. డ్రైవర్లు, కండెక్టర్ల చేత 15 నుంచి 16 గంటల సేపు డ్యూటీ చేయిస్తున్నారన్నారు. వైకాపా ఎమ్మెల్యే శ్రీవాణి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాతోపాటు రాష్ట్రంలోని ఏజన్సీ ప్రాంతాల్లో పిహెచ్‌సి సెంటర్లలో వైద్యుల కొరత ఉందన్నారు. తక్షణమే గిరిజనులకు వైద్య సహాయం అందించేందుకు పిహెచ్‌సి సెంటర్లలో డాక్టర్లను నియమించాలన్నారు. టిడిపి ఎమ్మెల్యే వి గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ అనకాపల్లిలో చెరకు రైతుల ప్రయోజనాలను, బెల్లం వర్తకుల పరిరక్షించాలని కోరారు. వారికి వెంటనే బకాయిలు చెల్లించాలన్నారు. వైకాపా ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్ల ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు చెల్లించాలని కోరారు. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేయాలని కోరారు.

రోజాను సమర్థిస్తారా?
జగన్‌ను నిలదీసిన అనిత

హైదరాబాద్, మార్చి 8: భారతదేశంలో మహిళలకు ప్రత్యే క గౌరవం ఉందని టిడిపి ఎమ్మెల్యే అనిత అన్నారు. మంగళవారం శాసనసభలో మహిళాదినోత్సవ సందర్భంగా జరిగిన చర్చలో పాల్గొంటూ ఈ దేశంలో మహిళగా పుట్టినందుకు తాను గర్వపడుతున్నానని చెప్పారు. మహిళల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎంతో కృషి చేస్తోందని, మహిళలకు పవిత్రమైన పసుపురంగును ఎంచుకోవడంతోనే వారిపై తెలుగుదేశం పార్టీకి ఉన్న గౌరవం ఏమిటో స్పష్టమవుతోందని అన్నారు. మహిళల గురించి మాట్లాడుతున్న విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రోజా తనపై చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తారా అని ప్రశ్నించారు. ఆమెను విపక్ష నేత వెనుకేసుకు రావడం దారుణమని పేర్కొన్నారు.

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో
60 మందిపై కేసులు

హైదరాబాద్, మార్చి 8 : ఇరు రాష్ట్రాల్లో జరుగుతున్న ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 60 మందిపై మంగళవారం నాడు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 40 మందిపైనా ఆంధ్రాలో 15 మందిపై కేసులు నమోదు అయ్యాయి. మంగళవారం నాడు మాథ్స్, బోటనీ, సివిక్స్, సైకాలజీ పేపర్ల పరీక్షలు జరిగాయి. ఆంధ్రాలో 5,50,082 మందికి గానూ 5,27,236 మంది హాజరయ్యారు. తెలంగాణలో 5,28,903 మందికి గానూ 4,95,925 మంది హాజరయ్యారు. మాల్ ప్రాక్టీసు కేసులను తీసుకుంటే మెదక్‌లో ముగ్గురిపైనా , రంగారెడ్డిలో 17 మందిపైనా, మహబూబ్‌నగర్‌లో 10 మందిపైనా, కరీంనగర్‌లో ఒకరిపైనా, ఖమ్మంలో ముగ్గురిపైనా, వరంగల్‌లో ఏడుగురిపైనా, హైదరాబాద్‌లో నలుగురిపైనా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.

నాపై ఎమ్మార్వో కేసు పెట్టలేదు
ఎమ్మెల్యే చింతమనేని

హైదరాబాద్, మార్చి 8: తహసీల్దార్ వనజాక్షిపై దాడి ఘటనలో ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి శాసనసభను తప్పుదారి పట్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. మంగళవారం నాడు ఆయన శాసనసభలో మాట్లాడుతూ తహసీల్దార్‌ను డ్వాక్రా మహిళలు అడ్డుకున్నారని ర, దానిని తనపై ఆపాదించడం అన్యాయమని అన్నా రు. వనజాక్షి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన పేరు ఎక్కడా ప్రస్తావించలేదన్న విషయాన్ని జగన్ తెలుసుకోవాలని అన్నారు. మహిళలపై ఏ మాత్రం గౌరవం లేని జగన్‌కు మహిళల గురించి మాట్లాడే హక్కు లేదని ప్రభాకర్ పేర్కొన్నారు.

చురుగ్గా సచివాలయ
నిర్మాణ పనులు

గుంటూరు, మార్చి 8: సచివాలయ నిర్మాణ పనులు జూన్ 15 తేదీ నాటికి పూర్తిచేసి పాలనను శాశ్వతప్రాతిపదికన ప్రారంభించాలన్న ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా కంపెనీల ప్రతినిధులు నిర్మాణ పనులను శరవేగంగా చేస్తున్నారు. తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలో 45.12 ఎకరాల్లో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయ నిర్మాణపు పనులను ఎల్ అండ్ టి, షాపూజీ పల్లోంజీ కంపెనీలకు అప్పగించారు. ఫిబ్రవరి 17వ తేదీన శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన మరుక్షణం నుంచి నిర్మాణపు పనులు ప్రారంభమయ్యాయి. కేవలం రెండు రోజుల కాలంలో 45 ఎకరాలను చదునుచేసిన రెండు కంపెనీల ప్రతినిధులు ప్రస్తుతం పిల్లర్లు వేసే దశకు చేరుకున్నారు. కృష్ణానది పరివాహానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో వెలగపూడి ఉండటంతో సుమారు 26 అడుగుల లోతుగా పునాదులు తీసిన తరువాతనే రాయి పడుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అక్కడి నుంచి పునాదులు వేస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే పదుల సంఖ్యలో పిల్లర్లకు అవసరమైన మట్టికుంటల తవ్వకం, పూరె్తైంది. వెనువెంటనే పిల్లర్లను వేయడం కూడా జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. రోజూ మూడు షిఫ్ట్‌ల ప్రకారం 250 మంది కార్మికులు నిరంతరం పనులు చేస్తున్నట్లు కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ తెలియజేశారు. నిర్మాణ పనులు ప్రారంభించిన కొద్దిరోజులకే పిల్లర్ల దశకు చేరుకోవడంతో పరిసర గ్రామాల ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల నుండి కూడా పలువురు సచివాలయ నిర్మాణాన్ని వీక్షిస్తున్నారు.