రాష్ట్రీయం

కేంద్రం సహకరిస్తేనే.. గడువులోగా పోలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 20: కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తేనే నిర్దేశిత గడువు ప్రకారం వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాగలదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. సోమవారం రాత్రి సచివాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణం 57.57 శాతం పూర్తయిందన్నారు. వర్షాల కారణంగా కొంత జాప్యం ఏర్పడిందన్నారు. గత నాలుగేళ్లలో 56వేల కోట్ల రూపాయలు నీటిపారుదల రంగానికి ఖర్చు చేశామన్నారు. ఇప్పటి వరకు 9 ప్రాజెక్టులు ప్రారంభించామని, మరో 6 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. మొత్తం 90వేల కోట్ల వ్యయంతో 29 ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురావాలనేదే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం రూ. 33వేల 720 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. మరో ఆరువేల కోట్ల ఖర్చుతో గోదావరి నీటిని పెన్నాకు తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా పెండింగ్‌లో ఉన్న 57 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా కరవును అధిగమించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఫలితంగా రెండుకోట్ల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, మరో కోటి ఎకరాల మేర ఉద్యానవన
పంటలను సాగులోకి తీసుకు వస్తామన్నారు. ప్రస్తుతం కోటీ పది లక్షల ఎకరాలకు నీరందుతోందని తెలిపారు. జలవనరుల నిర్వహణ ద్వారా 2.3 మీటర్ల వరకు భూగర్భ జలాలు పెరిగాయన్నారు. స్మార్ట్ వాటర్‌గ్రిడ్ ఏర్పాటుతో ప్రజలకు జల భద్రత కల్పిస్తామన్నారు. వంశధార నుంచి ఐదు నదులు అనుసంధానం చేసి మహా సంగమానికి శ్రీకారం చుడతామని ప్రకటించారు. రాయలసీమ ప్రాంతానికి గతంలో కంటే ఈ సారి ఎక్కువ నీరందించ గలిగామన్నారు. అసాధారణ పరిస్థితులను సాధ్యం చేయగలిగామనే తృప్తి మాకు ఉందన్నారు. వర్షం ఎక్కువగా కురిసే జిల్లాతో పాటు పేదరికం, వలసలు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని అలాంటి జిల్లాను సస్యశ్యామలం చేయగలిగిన ఘనత తమకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు నిండి నీరు ప్రవహిస్తోందని వందల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతోందని వివరించారు. విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీవర్షాలు, వరదల కారణంగా 36 గ్రామాలకు రాకపోకలు స్తంభించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 16 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశామని ఆరువేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 6వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. వైద్యసేవలు, నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచామని వర్షాలు, వరద నష్టంపై కేంద్రానికి నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించామన్నారు. జాతీయ విపత్తుగా కేరళకు జరిగిన నష్టాన్ని పరిగణించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్‌లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు కేరళకు సాయం అందించేందుకు ముందుకు రావటం ద్వారా మానవత్వాన్ని చాటుకుంటున్నారని అభినందించారు. ఉద్యోగసంఘాలన్నీ రూ 24 కోట్లు ప్రకటించాయని చెప్పారు. పోలీసు విభాగం మరో 7 కోట్లు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఒకనెల వేతనంగా ఇవ్వనున్నట్లు వివరించారు. రెండువేల మెట్రిక్ టన్నుల బియ్యం అదనంగా కేరళకు పంపుతామన్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయే రాష్ట్రాల పట్ల కేంద్రం బాధ్యతగా స్పందించాలని డిమాండ్ చేశారు. ఏదో మొక్కుబడి నిధులు ప్రకటించి బాధ్యతల నుంచి తప్పుకోవాలని ప్రయత్నించటం సరి కాదన్నారు. హుదుద్ తుపాను సమయంలో కూడా రాష్ట్రానికి 650 కోట్లు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు.