రాష్ట్రీయం

సహజ సంపద లూటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, ఆగస్టు 20: చంద్రబాబు పరిపాలనకు, బ్రిటిష్ పరిపాలనకు తేడా ఏమీ లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విరుచుకు పడ్డారు. విశాఖ జిల్లా కోటవురట్ల మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గత నాలుగన్నరేళ్ళ నుంచి రాష్ట్రంలో పోలీసు రాజ్యం కొనసాగుతోందన్నారు..ఇసుక, మట్టి, సున్నపురాయి, లేటరైట్ తదితర సహజ వనరులను దోచేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, వైద్య విద్యార్థులు, రైతులు,నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టి చంద్రబాబు పబ్బం గడుపుకొంటున్నారన్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన చంద్రబాబు ప్రత్యేక హోదా రాకుండా అడ్డు పడుతున్నారన్నారు. చంద్రబాబు చేస్తున్న దుబారాకు అడ్డూ అదుపు లేకుండా పోతుందన్నారు. ఇతర రాష్ట్రాలు తక్కువ వడ్డీకి బాండ్లు సేకరిస్తుండగా, రాష్ట్రంలో మాత్రం అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో బాండ్లను 10.5 శాతం అధిక వడ్డీతో జారీ చేసి రూ.17 కోట్లు కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం
రాజధానిని నిర్మాణం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే కాగా, రాజధాని పేరుతో బాండ్లు జారీ చేసి రెండువేల కోట్లు ఎందుకు సేకరించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. వందలాది ఎకరాల భూములను రాజధాని పేరుతో కాజేసి బినామీలకు తక్కువ రేట్లకు చంద్రబాబు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రాజధాని పేరుతో పెద్దయెత్తున అవినీతి అక్రమాలకు చంద్రబాబు పాల్పడుతున్నారన్నారు. తాత్కాలిక సెక్రటేరియట్ ఖర్చు అడుగుకు 10 వేల రూపాయలు చేసి లంచాలు మేస్తున్నారన్నారు. అంత ఖర్చు చేస్తున్నా వర్షం పడితే కారిపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గత నాలున్నరేళ్ళలో ఆరువేల కోట్లు చంద్రబాబు దుబారా చేశారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ధర్మపోరాట దీక్షల పేరుతో రూ. 52 కోట్లు, ప్రత్యేక విమానాల ఖర్చు రూ.100 కోట్లు, అధికారుల ప్రయాణాల ఖర్చు రూ.120 కోట్లు అనవసరంగా ఖర్చు పెట్టారన్నారు. దేవుడు పేరు చెప్పి పుష్కరాల్లో రూ.320 కోట్లు కాజేశారన్నారు. జన్మభూమి పేరుతో రూ.175కోట్లు, నవ నిర్మాణ దీక్ష పేరుతో రూ.25 కోట్లు, మాష్టర్ ఫ్లాన్‌ల పేరుతో రూ.116 కోట్లు, హ్యాపీ సీటీస్ పేరుతో రూ.61 కోట్లు, భాగస్వామ్య సదస్సుల పేరుతో రూ. 150కోట్లు దుబారా చేశారని ఆరోపించారు. అనవసరంగా ఖర్చు చేసిన ఆరువేల కోట్ల రూపాయలను పోలవరానికి ఖర్చు పెడితే ఈపాటికి నీరు వచ్చేదన్నారు. అబద్దాలు, మోసాలు, అన్యాయం, అవినీతి చేయడంలో చంద్రబాబుని మించిన వారు ఎవ్వరూ లేరన్నారు. ఇప్పటి వరకు బీజేపీ, టీఆర్‌ఎస్, సీపీ ఐ, సీపీఎం, జనసేన పార్టీల పొత్తులతో లాభపడి చివరికి వదిలేసిన చంద్రబాబు నేడు టీడీపీకి వ్యతిరేక కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిద్ధపడతూ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అవకాశవాది అనేది రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయిందన్నారు. రాష్ట్రంలో అన్యాయమైన పాలన, సిగ్గులేని రాజకీయాలకు బాబు పాల్పడుతున్నారని అన్నారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో నిస్సిగ్గుగా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతునిచ్చిన తెలుగుదేశం విలువలు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొందితే కేజీ బంగారం తోపాటు బోనస్‌గా బెంజ్‌కారు ఇస్తానని చెప్పినా ప్రజలు నమ్మరని చంద్రబాబుకు తెలుసునన్నారు. ఒక్కో ఓటరుకు మూడు వేలు రూపాయలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. మూడువేల కాదు ఐదువేలు ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేయాలన్నారు.
చక్కెర ఫ్యాక్టరీలు కుదేలు
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సహకార రంగంలో నడుస్తున్న చక్కెర ఫ్యాక్టరీలు కుదేలయ్యాయని జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత సుగర్ ఫ్యాక్టరీలు వరుసగా మూత పడుతున్నాయన్నారు. విజయనగరం జిల్లా భీమసింగి, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఫ్యాక్టరీలు మూతపడ్డాయన్నారు. అనకాపల్లి సమీపంలోని తుమ్మపాల ఫ్యాక్టరీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. లాభాల్లో నడిచే ఏటికొప్పాక, చోడవరం ఫ్యాక్టరీలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయన్నారు. ఏటికొప్పాక సుగర్ ఫ్యాక్టరీ రూ. 22కోట్లు, చోడవరం ఫ్యాక్టరీ రూ. 100 కోట్లు నష్టాలతో నడుస్తున్నాయన్నారు. ఏటికొప్పాక ఫ్యాక్టరీ రైతులకు 4.20 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు.

చిత్రం..కోటవురట్ల సభలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి