రాష్ట్రీయం

3వేల కోట్లతో రైతు నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల: విశాఖపట్నం జిల్లా, కోటవురట్ల మండలంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విజయవంతమైంది. జగన్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. దారిపొడవునా మహిళలు స్వాగతం పలికారు. కైలాసపట్నంకు చెందిన ఏటికొప్పాక లక్కబొమ్మల తయారు చేసే కార్మికులు అంకుడు కర్ర, లక్కతో చేసిన ఫ్యాన్ బొమ్మను జగన్‌కు బహూకరించారు. ఈ బొమ్మను ఆసక్తిగా పరిశీలించిన జగన్ బొమ్మ తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. దీనికి తయారీకి అయిన ఖర్చు ఎంత అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులతో ఫొటో దిగారు. క్యూలో నిల్చుని తనను కలిసేందుకు ఎదురుచూస్తున్న మహిళల వద్దకు వెళ్ళి అప్యాయంగా పలకరించారు. పలువురు మహిళలు జగన్‌తో కలిసి సెల్ఫీలు దిగారు. పింఛన్లు, సంక్షేమ పథకాలు అందడం లేదని మహిళలు జగన్ వద్ద మొర పెట్టుకున్నారు. ఆరు నెలల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులందరికీ పథకాలు మంజూరు చేస్తానని జగన్ వారికి హామీ ఇచ్చారు. కైలాసపట్నం నుంచి పాత రోడ్డు, కొత్తగొట్టివాడ, ముడగల్లోవ, రామచంద్రపురం మీదుగా పర్యటన సాగింది. రామచంద్రపురంలో జగన్‌ను కలిసిన రైతులు మాట్లాడుతూ వ్యవసాయం లాభసాటిగా ఉండడం లేదని, సాగు ఖర్చు పెరిగిపోవడంతో నష్టాలు చవిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తానని జగన్ వారికి హామీ ఇచ్చారు. ప్రతీ రైతుకు ఏడాదికి పెట్టుబడి కోసం ఖరీఫ్‌కు ముందే 12,500 రూపాయలు ఇస్తామని, విపత్తు నిధి ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. బోర్లు ఉచితంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మూడువేల కోట్లతో రైతు నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయానికి పగటిపూట ప్రతీ రోజు తొమ్మిది గంటలు విద్యుత్ ఇస్తామని, వడ్డీ లేని పంట రుణాలను అందిస్తామన్నారు. ప్రతీ నియోజకవర్గానికి శీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గాన్ని యూనిట్‌గా చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మంజూరు చేస్తామని, దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తామని జగన్ హామీ ఇచ్చారు.

చిత్రం..విశాఖలో నిర్వహించిన పాదయాత్రలో ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్