రాష్ట్రీయం

ముదురుతున్న పంచాయతీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మె వ్యవహారం ముదురుతోంది. విధుల్లోకి రావాలని ఓ పక్క ప్రభుత్వం ఆదేశిస్తుండగా, ససేమిరా కుదరదని సిబ్బంది జేఏసీ తేల్చిచెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో సమ్మె చేస్తున్న సిబ్బంది బుధవారం సాయంత్రం ఐదు గంటల్లోగా విధులకు హాజరు కావాలని మంగళవారం నాడు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషి పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 33,534 మంది సిబ్బంది పనిచేస్తుండగా, వీరిలో 19,852 మంది విధులకు హాజరు కావడం లేదని ప్రభుత్వానికి సమాచారం అందిందన్నారు. విధులకు హాజరు కాని సిబ్బంది విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించా రు. బుధవారం సాయంత్రం ఐదుగంటలలోగా విధులకు హాజరుకాని సిబ్బంది వివరాలను పంచాయతీ ప్రత్యేక అధికారుల ద్వారా సేకరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ నెల 23 నుండి గ్రామ పంచాయతీల్లో విధులకు హాజరు కాని సిబ్బంది స్థానంలో పనిచేసేందుకు ఇతరులను నియమించుకోవాలని జోషి కోరారు.
అయతే తమ సమస్యలను పరిష్కరించకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ విధులకు హాజరయ్యేది లేదని, ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని పంచాయతీ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) తేల్చిచెప్పింది. జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు పాలడుగు భాస్కర్ మంగళవారం సాయంత్రం ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. వేతనం పెంచాలన్న డిమాండ్‌తో సహా 11 డిమాండ్లతో ప్రభుత్వానికి నోటీసు ఇచ్చామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ సిబ్బందికి 3000 రూపాయల నుండి 4000 రూపాయల వరకు వేతనం ఇస్తున్నారని, కనీస వేతనంగా 12 వేల రూపాయలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశామన్నారు. ప్రభుత్వం మాత్రం 8,500 రూపాయలు కనీస వేతనంగా ఇస్తామని ప్రకటించిందని, ఈ మేరకైనా జీఓ ఇవ్వాలని, ప్రభుత్వ ఖజానానుండి వేతనం చెల్లించాలని కోరినప్పటికీ, జీఓ ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందు వల్ల సమ్మె ప్రారంభించామని, దాదాపు 30 వేలపైగా సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారన్నారు. గత నెల 23 నుండి సమ్మె కొనసాగుతున్నప్పటికీ, డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం కనీసం చర్చలకు కూడా పిలవలేదన్నారు. గ్రామాల్లో ధర్మా చేస్తున్న సిబ్బందిని పంచాయతీరాజ్ అధికారులు భయపెడుతున్నారని, ఈ విధానం మంచిది కాదన్నారు.
ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రభుత్వ బెదిరింపు లేఖలను బుధవారం అన్ని మండల కేంద్రాల్లో దగ్దం చేస్తామని భాస్కర్ తెలిపారు. అలాగే ఎమ్మెల్యేల ఇళ్లముందు ధర్మా చేస్తామని ప్రకటించారు. ఇప్పటికైనా తమతో ప్రభుత్వం చర్చలు జరపాలని కోరుతున్నామన్నారు.