రాష్ట్రీయం

కాళేశ్వరానికి పచ్చజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) మంగళవారం కొట్టివేసింది. అన్ని అనుమతులు లభించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై క్షేత్రస్థాయి పరిశీలన అవసరం లేదని కూడా ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. తీర్పు వివరాలను కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్-ఇన్-చీఫ్ హరిరామ్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని హయాతుద్దీన్ అనే వ్యక్తి ఎన్‌జీటీలో పిటిషన్ వేశారు. ప్రాజెక్టుపై ఇంక్వయిరీ కమిటీ వేయాలని దాఖలైన పిటిషన్‌ను ఇదివరకే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొట్టివేసిన విషయాన్ని ఈ సందర్భంగా బెంచ్ గుర్తు చేసింది. రాజ్యాంగ న్యాయస్థానాలే కేసు కొట్టివేసిన తర్వాత ఇక ఈ అంశంపై విచారించడానికి ఏముంటుందని పిటిషన్‌దారున్ని ఎన్‌జీటీ నిలదీసింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయని, దీనిపై విచారణ జరపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీనిపై క్షేత్రస్థాయి పరిశీలన జరపాల్సిన అవసరం లేదని జస్టిస్ రాఘవేంద్ర రాథోడ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పర్యావరణ, అటవీ అనుమతులు రద్దు
చేయాలని దాఖలైన మరో పిటిషన్‌పై విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి ట్రిబ్యునల్ వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో దాఖలైన కేసు కొట్టివేయడం శుభ సూచకమని ఈఎన్‌సీ హరిరామ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే కేంద్ర జలవనరులశాఖతో పాటు పర్యావరణ, అటవీ, హైడ్రాలజీ అనుమతులన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుకు లభించడంతో కొత్తగా విచారించేది ఏముంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించిందని ఆయన స్పష్టం చేశారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొట్టివేయడం పట్ల నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేసారు. ప్రాజెక్టును వ్యతిరేకించే వారికి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదని మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణకు జీవధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికైనా సహకరించాలని ప్రతిపక్ష పార్టీలను మంత్రి కోరారు. తమ రాష్ట్రంలోని ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరతూ పిటిషన్ దాఖలు చేసిన చరిత్ర తెలంగాణలో తప్ప మరెక్కడా లేదని మంత్రి విమర్శించారు. ప్రాజెక్టుల కోసం ఇతర రాష్ట్రాల్లో తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏకతాటిపైకి వస్తాయని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేసారు. అయితే తెలంగాణలో మాత్రం ప్రాజెక్టులు కట్టకుండా ప్రతిపక్షాలు అడ్డుపడటం దురుదృష్టకరమని మంత్రి అన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో ఇప్పటికైనా ఇతర పిటిషన్లను ఉపసంహరించుకోవాలని మంత్రి హరీశ్‌రావు హితవు పలికారు.