రాష్ట్రీయం

వచ్చే నెలలో మళ్లీ బస్సు యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు వచ్చే నెలలో మళ్లీ బస్సు యాత్రను చేపట్టనున్నట్లు టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. బస్సు యాత్ర కోసం మంగళవారం గాంధీ భవన్‌లో ప్రజా చైతన్య బస్సు యాత్ర సమన్వయ కమిటీ కన్వీనర్, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉత్తమ్‌తో పాటు సీఎల్‌పి నేత కే. జానారెడ్డి, ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌సీ కుంతియా, కార్యదర్శి బోసు బాబు, బస్సు యాత్ర కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి ప్రభృతులు పాల్గొన్నారు. సమావేశానంతరం షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెలలో బస్సు యాత్ర 5వ విడతను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే 40కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర పూర్తయ్యిందని ఆయన తెలిపారు. మిగతా నియోజకవర్గాల్లోనూ యాత్ర పూర్తి చేస్తామని ఆయన వివరించారు. ఉత్తర తెలంగాణ యాత్రలో పాల్గొనాల్సిందిగా యుపీఎ చైర్ పర్సన్ సోనియాగాంధీని, ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్లు షబ్బీర్‌అలీ చెప్పారు. బస్సు యాత్ర వివరాలు, పర్యటనను ఖరారు చేసేందుకు మరో కమిటీని నియమించామని తెలిపారు. కమిటీలో ఆర్. దమోదర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, దయాసాగర్, పొన్నం ప్రభాకర్, బిక్షమయ్య గౌడ్, మల్లు రవి, ఎమ్మెల్యే సంపత్ కుమార్, బలరాం నాయక్, మంగీలాల్ నాయక్‌ను నియమించారు.

చిత్రం..గాంధీ భవన్‌లో మంగళవారం బ్రిటీష్ హై కమిషనర్ ఫ్లెమింగ్‌తో ఉత్తమ్