రాష్ట్రీయం

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 21: తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజున శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9గంటలకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం జరిగింది. అనంతరం ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం 4 గంటలకు స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆభరణాలతో సల్లింపు నిర్వహించారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. ఈకార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, పేష్కార్ రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు. పవిత్రోత్సవాల కారణంగా టీటీడీ అష్టదళ పాదపద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసింది.