రాష్ట్రీయం

జానపద మూలాలను భావితరాలకు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 21: జానపద మూలాలను అనే్వషించి, వాటిని వెలికి తీసి భావితరాలకు అందించాలని అపుడే జానపద సంస్కృతిలోని ఔన్నత్యం వారికి అందుతుందని ప్రముఖ రచయిత, ప్రజాకవి గోరటి వెంకన్న అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో మంగళవారం అంతర్జాతీయ జానపద విజాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోరేటి వెంకన్న మాట్లాడుతూ జానపద మూలాలు ప్రకృతిలో ఉన్నాయన్నారు. నేడు ఆధునిక సమాజంలో మానవుడు ప్రకృతికి దూరంగా జీవిస్తున్నాడని, దీంతో సంస్కృతికి కూడా దూరమవుతున్నాడన్నారు. ప్రాచీన జానపద సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జానపద సాహిత్యం ప్రజల హృదయాలను హత్తుకుందని, కాబట్టే వేమన వంటి వారు ప్రజాకవులుగా కీర్తింపబడుతున్నారన్నారు. ఈసందర్భంగా గోరేటి వెంకన్నను ఘనంగా సత్కరించారు. నన్నయ యూనివర్శిటీ వైస్-్ఛన్సలర్ ముత్యాలనాయుడు, సదస్సు కన్వీనర్ డాక్టర్ తరపట్ల సత్యనారాయణ, రిజిస్ట్రార్ డాక్టర్ టి అశోక్ తదితరులు పాల్గొన్నారు.