రాష్ట్రీయం

వర్షాకాలంలో అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: వర్షాకాలంలో ఎలాంటి ప్రమాధాలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని దక్షిణ మధ్య రైల్వే జీఓం వినోద్ కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. రైల్ నిలయంలో జోన్ పరిధిలోని ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రత, సమయపాలన, సరుకు రావాణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. లోకోల వైఫల్యం, యార్ట్‌ల్లో పట్టాలు తప్పడం, లెవల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు జరగకుండా అధికారులు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. పరిశుభ్రత, మొక్కల పెంపకం, కాపలాలేని లెవల్ క్రాసింగుల తొలగింపు మొదలైన విషయాలపై సమగ్రంగా చర్చించారు. సాధారణ, దివ్యాంగ ప్రయాణికుల టాయిలెట్ల నిర్మాణం, పరిశుభ్రతపై దృష్టి సారించాలని సూచించారు. భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రైలు పట్టాల నిర్వహణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నదులు, ఏరులు ప్రవహించే రైల్వే బ్రిడ్జిలను పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను నియమించా చక్కని ముందస్తు ప్రణాళికతో విపత్కర పరిస్థితలను ఎదుర్కొవడానికి అవసరమైన సాధనాసామాగ్రిని సిద్ధం చేసుకోవాలన్నారు. స్టేషన్లలో, రైళ్ళలో పరిశుభ్రతను పెంచడానికి కావల్సాన ప్రణాళికలు తయారు చేయాలని, పచ్చదనం ప్రోత్సహించడానికి అత్యధిక స్థాయిలో మొక్కలు పెంచే కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను కోరారు. రైళ్లు, రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేసి, నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
వరద ప్రాంతాలకు ఉచిత రవాణ
భారీ వర్షాలతో అతలాకుతలం అయిన కేరళ రాష్ట్రానికి సహాయం అందించే తినుబండరాళ్లు, వస్తువులను దక్షిణ మధ్య రైల్వే ఉచితంగా చేరవేస్తోంది. వరదలు ముంచెత్తిన కేరళ రాష్ట్రానికి రైల్వేలు చేయూతనందించాలని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఇచ్చిన సూచన మేరకు దక్షిణ మధ్య రైల్వే ‘జాయిన్ హ్యాండ్స్ ఫర్ కేరళ’లో భాగస్వామ్యం అవుతోంది. వినోద్ కుమార్ నేతృత్వంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 60 టన్నులను కేరళకు చేరవేసింది.