రాష్ట్రీయం

శ్రీశైలం గేట్లు మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 21: శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లను మంగళవారం అధికారులు మూసివేశారు. ఎగువన కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి వరద పూర్తిగా తగ్గిపోవడంతో గేట్లన్నింటినీ మూసివేశారు. అయితే ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తూ దిగువ నాగార్జునసాగర్‌కు సుమారు 76,700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి మంగళవారం ఉదయం సమయానికి వరద తగ్గింది. దీంతో 5 గేట్లలో ఉదయం 9 గంటలకు 2 గేట్లు, ఆ తరువాత గంటకు ఒకొక్కటి చొప్పున మూసి వేస్తూ మధ్యాహ్న సమయానికి అన్ని గేట్లను పూర్తిగా దించేశారు. జలాశయానికి రాత్రి 8 గంటల సమయానికి ఎగువ కృష్ణానది ద్వారా 1,57,272 క్యూసెక్కులు, తుంగభద్ర ద్వారా 43,494 క్యూసెక్కులు కలిపి మొత్తం 2,05,766 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. పోతిరెడ్డిపాడు ద్వారా 26 వేల క్యూసెక్కులు, హంద్రీ-నీవా ద్వారా 2,623 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2,400 క్యూసెక్కుల నీరు తాగు, సాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు. ఇక కుడి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అనంతరం 34,276 క్యూసెక్కులు, ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 42,378 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా 882.5 అడుగులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.88 టీఎంసీలు కాగా 201.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది.