రాష్ట్రీయం

పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో ఈ నెల 23 నుండి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పర్యటన వాయిదా పడిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం చెప్పారు. జంగారెడ్డిగూడెం, చింతలపూడి, పోలవరం ప్రాంతాలలో ఈ పర్యటన జరగాల్సి ఉందని, అయితే ఈ జిల్లాల్లో అధిక వర్షపాతం వల్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడటం, చాలా ప్రాంతాలు జలమయం కావడంతో పర్యటన వాయిదా పడిందని అన్నారు. పర్యటన ఎపుడు జరుగుతుందో త్వరలోనే తెలియజేస్తామని ఆయన చెప్పారు. వాతావరణం సాధారణ స్థితికి రాగానే పర్యటన ఉంటుందని ఆయన తెలిపారు. ఇలావుండగా భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న కేరళ వాసులను ఆదుకోవాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యకర్తలను కోరింది. జనసైనికులు అంతా తమ శక్తి కొద్దీ కేరళకు సాయం చేయాలని కమిటీ సూచించింది. సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు సందర్భంగా జనసేన సైనికులు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని అందులో భాగంగా కేరళ సాయం కూడా చేర్చాలని కోరుతున్నారని కమిటీ నేత మాదాసు గంగాధరం చెప్పారు.
జనసేనలో పితాని బాలకృష్ణ
తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరం నియోజకవర్గం వైకాపా మాజీ సమన్వయకర్త పితాని బాలకృష్ణ జనసేన పార్టీలో చేరబోతున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి తన అనుచరులతో వచ్చి పవన్‌కళ్యాణ్‌ను కలిసి ఆకాంక్షను వ్యక్తం చేశారు. పవన్ ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. పవన్ సిద్ధాంతాల్లో ఒకటైన కులాలను కలిపే ఆలోచనా విధానం తూర్పుగోదావరిలో ప్రతి ఒక్కరూ ఆచరించాల్సి ఉంటుందని ప్రస్తావించారు. తాను సామాజికంగా శెట్టి బలజ కులానికి చెందిన వాడినని , శెట్టి బలిజలకు సరైన రాజకీయ ప్రాధాన్యం లభించడం లేదని పితాని పేర్కొన్నారు. పవన్‌కళ్యాణ్ గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా తన అనుచరులతో కలిసి జనసేనలో చేరుతానని అన్నారు. పితానితో పాటు కొప్పిశెట్టి బాలకృష్ణ, గుత్తుల వెంకటేశ్వరరావు, సానబోయిన వీరభద్రరావు పవన్‌ను కలిశారు.