రాష్ట్రీయం

పిల్లలకు కళలపై అవగాహనకు బాలోత్సవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పిల్లలకు కళలపై అవగాహన కల్పించేందుకే బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాలు, ఉత్తమ ఉపాధ్యాయ సంఘం సంయుక్తంగా నవంబర్ 10, 11 తేదీల్లో నిర్వహిస్తున్న ఆట బాలోత్సవ్ బ్రోచర్‌ను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంత్రుల నివాస ప్రాంగణంలో ఆవిష్కరించారు. పిల్లల్లో చదువు ఒక్కటే కాకుండా వివిధ కళల పట్ల అవగాహన కల్పించడంలో ఈ ఉత్సవాలు ఉపయోగపడతాయని అన్నారు. చిన్నప్పటి నుండి ఇలాంటి జాతీయ స్థాయి ఉత్సవాల్లో పాల్గొనడం పిల్లలకు మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందని అన్నారు. ఈ ఉత్సవాల్లో దేశంలోని 10 రాష్ట్రాల పిల్లలు, కళాకారులు పాల్గొంటున్నట్టు ఉత్తమ ఉపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు చెప్పారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 24అంశాలు, 54 విభాగాల్లో వివిధ కార్యక్రమాలను రూపొందిస్తామని అన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనే ప్రతి భాగస్వామికి ఒక సర్ట్ఫికేట్ అందిస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కళాకారులు, పిల్లలకు భోజన వసతి కల్పించామని పేర్కొన్నారు. అనంతరం రాష్టమ్రంత్రులు హరీష్‌రావు, నాయని నర్సింహారెడ్డి, జోగు రామన్న, చందులాల్ గారు, ఈటెల రాజేందర్ , జి జగదీష్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డిలను కూడా కలిసి ఆహ్వానించామని, ప్రతి విద్యార్థికీ పాల్గొన్నందుకు సర్ట్ఫికేట్లు ఇస్తామని తెలిపారు. వ్యాసరచన, తెలుగు పద్యాల పోటీ, నచ్చిన బొమ్మ పేరణి నృత్యం, కూచిపూడి నృత్యం, భరత మాత నృత్యం, జానపదం , మిమిక్రీ, జబర్దస్త్ సన్నివేశాలు, ఫ్యాన్సీ డ్రెస్ ఇన్‌స్పైర్ అవార్డులు, వ్యర్థంతో అర్థం, మెగా డీ షో తదితర అంశాలు ప్రధానంగా ఉన్నాయని అన్నారు. ఆసక్తి ఉన్నవారంతా వెబ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని చెప్పారు.