రాష్ట్రీయం

జాతీయ ప్రవేశపరీక్షల షెడ్యూలు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ జాతీయ ప్రవేశపరీక్షల షెడ్యూలును ఖరారు చేసింది. నీట్ యూజీని మే 5వ తేదీన నిర్వహిస్తారు. దాని ఫలితాలు జూన్ 5న ప్రకటిస్తారు. నవంబర్ 1 నుండి రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. ఏప్రిల్ 15 నుండి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక యూజీసీ నెట్ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 30 వరకూ అవకాశం కల్పిస్తారు. అడ్మిట్ కార్డులను నవంబర్ 19న డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష 2018 డిసెంబర్ 9 నుండి 23 మధ్య జరుగుతుంది. వాటి ఫలితాలను 2019 జనవరి 10వ తేదీన ప్రకటిస్తారు. ఇక జేఈఈ మెయిన్స్ -1 పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా జరుగుతుంది. పరీక్ష రిజిస్ట్రేషన్‌ను 2018 సెప్టెంబర్ 1 నుండి 30 మధ్య నిర్వహిస్తారు. పరీక్ష హాల్‌టికెట్లను డిసెంబర్ 17 నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, పరీక్ష 2019 జనవరి 6 నుండి 20 మధ్య జరుగుతుంది. వాటి ఫలితాలను జనవరి 31న విడుదల చేస్తారు. జెఈఈ మెయిన్స్-2 పరీక్ష రిజిస్ట్రేషన్ 2019 ఫిబ్రవరి 8న మొదలవుతుంది. మార్చి 7 వరకూ గడువు ఇస్తారు. అడ్మిట్ కార్డులను 2019 మార్చి 18న డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష ఏప్రిల్ 6 నుండి 20 మధ్య ఉంటుంది. వాటి ఫలితాలను 2019 ఏప్రిల్ 30న ప్రకటిస్తారు. ఇక సీమ్యాట్ పరీక్ష రిజిస్ట్రేషన్ 2018 నవంబర్ 1 నుండి 30 వరకూ జరుగుతుంది. హాల్‌టిక్కెట్లను 2019 జనవరి 7 నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష జనవరి 28న జరుగుతుంది. ఫలితాలను ఫిబ్రవరి 10న ప్రకటిస్తారు. ఈసారి నీట్ పరీక్ష పెన్ను పేపర్ పద్ధతిలోనే జరుగుతుందని, ఆన్‌లైన్‌లో నిర్వహించడం లేదని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 2,697 టెస్టు ప్రాక్టీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని సెప్టెంబర్ 1 నుండి ప్రతి శనివారం, ఆదివారం అక్కడకు వెళ్లి ప్రాక్టీస్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.