రాష్ట్రీయం

మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలను ఆదేశించారు. ప్రజల మన్ననలు పొందుతున్న మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్‌ను ప్రజలకు మరింత చేరువుగా తీసుకువెళ్లాలని పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీని పవన్ ఆదేశించారు. 12 అంశాలతో కూడిన పార్టీ విజన్ డాక్యుమెంట్ ఈ నెల 14వ తేదీన పవన్ విడుదల చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్, రేషన్‌కు బదులు 2,500 నుండి 3,500 రూపాయిల నగదు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వంటి పథకాలు ప్రజామోదాన్ని పొందుతున్నాయని అన్నారు. అయితే, ఈ అంశాలు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. సెప్టెంబర్ 12 నుండి శాసనసభ ఎన్నికల వరకూ ఈ అంశాలపై ప్రచారం చేయాలని ఆయన నిర్ణయించారు. విజన్ డాక్యుమెంట్‌పై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ బుధవారం నాడు విస్తృతంగా చర్చించింది. ప్రచారం కోసం ఎటువంటి మాద్యమాలను ఉపయోగించాలి? ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలనే అంశాలపై ప్యాక్ చర్చించింది. దీనిపై ఒక పథకం రూపొందించింది. దీనిని అందుబాటులస ఉన్న పార్టీ జిల్లా కమిటీలతో చర్చించాలని నిర్ణయించారు. జిల్లా కమిటీల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఆమోదం కోసం పార్టీ అధ్యక్షుడికి సమర్పించాలని నిర్ణయించారు. మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ ప్రచారంలో పార్టీ శ్రేణులను సైతం భాగస్వామ్యులను చేయాలని ప్యాక్ నిర్ణయించింది.
చిరంజీవికి శుభాకాంక్షలు
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ హాజరయ్యారు. తన భార్య లెజినోవా, పిల్లలతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్ ఆయనకు జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. పవన్ రాకతో చిరంజీవి ఇల్లు సందడిగామారిపోయింది.