రాష్ట్రీయం

వర్షాలతో 10 లక్షల ఎకరాల పంటకు నష్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: గత వారం, పదిరోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లి ఉంటుందని అధికార యంత్రాంగం అంచనా వేసింది. అయితే స్పష్టమైన వివరాలు మాత్రం వ్యవసాయ శాఖకు కానీ, స్టాటిస్టికల్ శాఖకు కానీ రాలేదు. పంటలకు జరిగిన నష్టం వివరాలను పంటల వారీగా, సర్వేనెంబర్ వారీగా, గ్రామాల వారీగా పంపించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవంగా రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో రైతులు 108 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తారు. ఈ ఖరీఫ్‌లో ఇప్పటి వరకు 90 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. 18 లక్షల ఎకరాల్లో వరి, ఎనిమిది లక్షల ఎకరాల్లో జొన్న, 11 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, ఏడు లక్షల ఎకరాల్లో కంది, ఐదు లక్షల ఎకరాల్లో సోయాబీన్, 44 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. మిగతా విస్తీర్ణంలో ఇతర పంటలు వేశారు.
భారీ వర్షాలు కురిసిన ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ (పాత జిల్లాలు) పరిధిలో పంటలకు నష్టం ఎక్కువగా జరిగింది. బుధవారం వరకు కూడా వర్షాలతోనే ముద్దవుతున్న ఈ జిల్లాల్లో పంటల నష్టంపై సమగ్ర సర్వే చేసి నివేదికలు పంపిచాలని కోరామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సీ. పార్థసారథి తెలిపారు. బుధవారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, నష్టం జరిగిన పంటల్లో బీమా చేయించిన పంటలు, బీమా లేని పంటలు ఉన్నాయన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పంపించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని వివరించారు. బీమా పరిధిలోకి వచ్చే పంటలకు సంబంధిత బీమా సంస్థ పరిహారం చెల్లిస్తుందన్నారు. బీమా సంస్థలు కూడా తమ దారిలో తాము సర్వే చేస్తాయని వివరించారు. ప్రకృతి వైపరీత్యాల మూలంగా పంటలకు నష్టం జరిగితే బీమా చేసిన పంటలకు సంబంధించిన రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. అన్ని పంటలకు బీమా చేయించాలంటూ రైతులను తమ శాఖ మొదటి నుండి కోరుతోందని, రైతుల్లో చైతన్యం కలిగిస్తోందని వివరించారు. ఏది ఏమైనా పూర్తి వివరాలు అందిన తర్వాత పరిస్థితిపై సమీక్షిస్తామన్నారు. గత వారం పదిరోజుల నుండి కురుస్తున్న వానల మూలంగా చాలా జిల్లాల్లో పంటలకు లాభం జరిగిందని పార్థసారథి వివరించారు.