రాష్ట్రీయం

‘స్వచ్ఛ’త లేని సచివాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: రాష్ట్ర సచివాలయంలోని ప్రధాన రోడ్డే అపరిశుభ్రతకు నిలయంగా మారితే, మిగతా ప్రాంతాల విషయం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, ఇతర అధికారులు రోజూ తిరిగే రోడ్డు పక్కనే విరిగిన కుర్చీలు, బల్లలు, బీరువాలు పడి ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ చెత్తాచెదారం అందరికీ స్పష్టంగానే కనిపిస్తోంది. ఒకరోజు, రెండురోజులు కాదు.. దాదాపు ఏడాది నుండి పనికిరాని వస్తువులన్నీ ‘సీ’ బ్లాకు (సీఎం కార్యాలయం, సీఎస్ కార్యాలయం, జీఏడి కార్యాలయాలు ఉండే బ్లాకు) ఎదురుగా పడి ఉన్నాయి. ‘సీ’ బ్లాకు నుండి తెలంగాణ గేట్ వైపు వెళ్లే మార్గంలో మూలమలుపు వద్ద పెద్ద ఎత్తున చెత్తాచెదారం పడి ఉండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. విదేశాలకు చెందిన పాలకులు, ఉన్నతాధికారులు మన రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు చెత్తపడి ఉన్న స్థలం పక్కనుండే ‘సీ’ బ్లాకుకు వస్తారు. ఈ రహదారిలోవెళ్లే వారందరికీ చెత్తాచెదారం స్పష్టంగా కనిపిస్తోంది.
రాష్ట్ర సచివాలయం మొత్తం రాష్ట్రానికి శుభ్రత విషయంలో ఆదర్శంగా ఉండాలనే అంతా భావిస్తారు. పాలకులు రోజూ తిరిగే రోడ్డుపక్కనే ‘వ్యర్థాలు’ ఉంటే పట్టించుకోకపోవడం గమనార్హం. కాగా, ఈ చెత్తాచెదారం ఏపీ రాష్ట్ర సచివాలయం పరిధిలోకి వస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఇప్పుడు హైదరాబాద్ నుండి అమరావతికి తరలిపోయింది. అందువల్ల సచివాలయం భవనాల వద్ద పరిశుభ్రత విషయంలో ఏపీ అధికార యంత్రాంగం పట్టించునే అవకాశం లేదు. తెలంగాణ-ఏపీ భవనాల సరిహద్దు భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం లాంటిదో భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలాంటిదో కాదుకదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చెత్తను తొలిగించేందుకు సరిహద్దు సమస్యలు అడ్డురావడం విచిత్రంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘స్వచ్ఛ భారత్’ మిషన్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 2014-15 లోనే స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమాల కింద రోడ్లశుభ్రత, మరుగుదొడ్ల నిర్మాణం తదితర పనులు జరుగుతున్నాయి. రాష్ట్రం మొత్తంలో ‘స్వచ్ఛత’ విషయంలో సచివాలయమే ఆదర్శంగా ఉండాలి. సచివాలయంలోనే ఈ దుస్థితి నెలకొని ఉంటే ఎవరికీ పట్టింపులేదా అన్న విమర్శలు వస్తున్నాయి.