రాష్ట్రీయం

హామీలపై చర్చకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నాలుగేళ్ళ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు ‘ప్రగతి నివేదన’ సభ పెడితే, ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు అయ్యాయో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే ఏ. రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వచ్చే నెల 2న ప్రగతి నివేదన సభ పెడితే 25 లక్షల మంది కాదు కదా కనీసం రెండున్నర లక్షల మంది కూడా హాజరుకారని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. వరంగల్ సభ తరహాలో బీరు, బిర్యానీ ఇచ్చినా ప్రజలు రారని, ఒకవేళ వచ్చినా వారు వెంటనే వెనుదిరుగుతారని అన్నారు. ఆ సభా వేదిక నుంచి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈనెల 15లోగా ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇస్తామన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. 2017 డిసెంబర్ నాటికే ఇంటింటికీ నీళ్ళు ఇస్తామని, లేదంటే ఓట్లు అడగమని టీఆర్‌ఎస్ నేతలు ఇచ్చిన హామీ ఏమైందని ఆయన నిలదీశారు. 2018 డిసెంబర్ నాటికీ నీళ్ళు ఇవ్వలేరని, ఇదే తన సవాల్ అని అన్నారు. కొత్త పాస్ పుస్తకాల పేరిట రైతుల మధ్య వివాదాలు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్‌లో తిరుగుబాటు వస్తుందేమోనన్న భయంతో ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తామన్న చర్చకు తెర లేపారని రేవంత్ అనుమానం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జనవరి 1 వరకూ కొత్త ఓటర్ల జాబితా ఇవ్వలేమని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని, అటువంటప్పుడు ముందస్తు ఎన్నికలకు అవకాశం ఎక్కడ ఉందన్నారు.
టీఆర్‌ఎస్‌కు ఇప్పటికే 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, దీనికి తోడు మజ్లిస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల మద్ధతు ఉందని ఆయన తెలిపారు. సిట్టింగ్‌లందరికీ టికెట్లు ఇస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా కొత్తగా ఎవరికీ టికెట్లు ఇవ్వగలరని ఆయన అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో జత కట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు.