రాష్ట్రీయం

కీచక గురువు ఘాతుకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 22: అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన గురువు అడ్డదారి తొక్కాడు. తన దగ్గర చదువుకు వచ్చిన విద్యార్థినిని మాయమాటలతో లోబరచుకుని, ఆమెను గర్భవతిని చేసి, రహస్యంగా గుడిలో వివాహం చేసుకున్నాడు. ఈ ప్రబుద్ధుడి ఉదంతం వెలుగులోకి రావడంతో బాలిక తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిని నగ్నంగా ఊరేగించారు. అంతేకాకుండా తీవ్రంగా కొట్టారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని నిందితుడిని కాపాడి స్టేషన్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. కర్నూలుకు చెందిన కారే రాంబాబు స్థానికంగా ఒక ప్రైవేటు పాఠశాలలో ఇంగ్లీషు టీచర్‌గా పనిచేస్తున్నాడు. రాంబాబు భార్య నరసాపురంలో స్ట్ఫానర్సుగా పనిచేస్తోంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో రాంబాబు తన తల్లితో కలిసి స్థానిక పత్తేబాదలో నివాసం ఉంటున్నాడు. రాంబాబు పనిచేస్తున్న పాఠశాలలో గతంలో పదవ తరగతి చదివిన ఒక బాలికతో అతను చనువు పెంచుకున్నాడు. ఇదేక్రమంలో ఆ బాలిక ఇంటర్ చదువుతున్న సమయంలో కూడా టీచర్ రాంబాబు వద్దకు ఇంగ్లీషు, లెక్కలు నేర్చుకునేందుకు వెళ్లేది. ఇదే సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి రాంబాబు లొంగదీసుకున్నాడు. ప్రస్తుతం బాలిక పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది. కొద్దిరోజుల క్రితం ఆ బాలిక గర్భవతి అయ్యింది. తన సంగతి ఏమిటని ఆమె రాంబాబును నిలదీయటంతో ఈనెల 19వ తేదీన బాలికను ద్వారకాతిరుమల తీసుకువెళ్లి రాంబాబు రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత బాలిక ఇంట్లో ఉన్న సమయంలో కడుపునొప్పితో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆ బాలిక గర్భవతి అని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబసభ్యులు పూర్తి విషయం తెలుసుకుని, మంగళవారం రాత్రి రాంబాబు ఇంటివద్దకు వెళ్లి బయటకు ఈడ్చుకు వచ్చి, దుస్తులు ఊడదీసి, నగ్నంగా చేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం నగరంలో కొంతసేపు ఊరేగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రాంబాబును కస్టడీలోకి తీసుకుని టూ టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అతనిపై ఫోక్స్, అత్యాచారం, అపహరణ కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటనలో ఏలూరు నగరంలో సంచలనం సృష్టించింది.