రాష్ట్రీయం

సింగరేణి లాభాల్లో కార్మికులకు 27శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో కార్మికులకు 27 శాతం వాటా ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుప్రకటించారు. గత ఏడాది 25 శాతం ఇవ్వగా ఈ సారి మరో రెండు శాతం పెంచి 27 శాతం ఇవ్వాల్సిందిగా సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ్ధర్‌ను సీఎం ఆదేశించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజికేఎస్) గౌరవాధ్యక్షురాలు, ఏంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్, టీమీజీఏస్ నాయకులు ప్రగతి భవన్‌లో బుధవారం ముఖ్యమంత్రిని కలిసారు. ఈ సందర్భంగా సింగరేణి అధికారులు, ఉద్యోగులు, కార్మికులకు సీఎం పలు వరాలు ప్రకటించారు. అధికారులకు చెల్లించాల్సిన ఎనిమిదేళ్ల పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని సీఎం ఆదేశించారు. అలాగే సింగరేణి అధికారులకు హైదరాబాద్‌లో ఇళ్లు నిర్మించుకోవడానికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కార్మికులకు మాదిరిగానే సంస్థలో పని చేసే అధికారులు, ఉద్యోగులకు ఇంటి నిర్మాణానికి వడ్డీలేకుండా పది లక్షల రూపాయల రుణాన్ని ఇవ్వాలని ఆదేశించారు. ఇకపై సంగరేణి కార్మికులను ఉద్యోగులుగా సంభోదించాలని సూచించారు. యాజమాన్యం, కార్మికులు వేర్వేరు కాదని, అంతా ఒక కుటుంబమనే భావన పెంపొందించుకోవాలని అన్నారు. ‘సింగరేణికి 120 సంవత్సరాల అనుభవం ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో ప్రతికూల వాతావరణంలోనూ పనిచేసే నేర్పు ఉంది. భూగర్భంలోని బొగ్గును వెలికితీసిన అనుభవం, పరిజ్ఞానంతో సింగరేణి మరింత ముందుకుపోవాలి. ఇతర మైనింగ్ రంగాలకు విస్తరించాలి. ఇప్పటికే థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగాల్లోకి ప్రవేశించింది. రాష్ట్రంలో ఆపారంగా ఉన్న ఇసుక నిల్వలు, గ్రానైట్ నిల్వలను వెలికి తీయడానికి సింగరేణి ముందుకు రావాలి. బయ్యారం గనుల్లో కూడా తవ్వకాలు జరిపే బాధ్యతను సింగరేణికి అప్పగించే యోచన ప్రభుత్వానికి ఉంది. ఏఏ రకమైన మైనింగ్ కార్యకలాపాల్లో సింగరేణ సంస్థ పని చేయగలదనే విషయంపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలి. అనుభవం, పనితీరు ఉపయోగించుకుని సింగరేణి సంస్థ మరింత విస్తరించాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఇలా ఉండగా, మాజీ సైనికుల సంక్షేమం కోసం సింగరేణి అధికారులు కోటి రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసారు. గతంలో సింగరేణి ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని సీఎంకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మరికొన్ని డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకరాగా సానుకూలంగా స్పందించారు. సింగరేణి అధికారులు, కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఈటెల రాజేందర్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం జడ్పీ చైర్ పర్సన్ గాడిపల్లి కవిత, టీబీజీకేఎస్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకట్రావ్, రాజీరెడ్డి తదితరులున్నారు.