రాష్ట్రీయం

2న ‘ప్రగతి నివేదన’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ముందస్తు ఎన్నికలపై కూడా చర్చ
* గడువు ప్రకారమే వెళ్లాలని మంత్రుల సూచన
హైదరాబాద్, ఆగస్టు 22: తెలంగాణ రాష్ట్ర సమితి నాలుగేళ్ల పాలనపై నిర్వహించబోయే ప్రగతి నివేదన సభ ముందుగా నిర్ణయించిన విధంగానే సెప్టెంబర్ 2న యథాతథంగా జరుగుతుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తోన్న వర్షాల కారణంగా సభ వాయిదా పడే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారానికి సీఎం కేసీఆర్ తెరదించారు. సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభ నిర్వహించాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీలో ఖరారు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర కమిటీ సమావేశానికి మంత్రులకు ఆహ్వానం లేకపోవడంతో ప్రగతి భవన్‌లో బుధవారం వారితో ప్రత్యేకంగా కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయాలను మంత్రులకు ఆయన వివరించారు. బహిరంగ సభకు రెండు, మూడుచోట్ల స్థలాలను పరిశీలించినప్పటికీ తుదిగా రంగారెడ్డి జిల్లాలో 1600 ఎకరాల్లో ఉన్న కొంగర కలాన్‌ను ఎంపిక చేసినట్టు కేసీఆర్ వెల్లడించారు. నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలనపై ప్రజలకు వివరించడానికి ఏర్పాటు చేసిన ప్రగతి నివేదికకు 25 లక్షల మంది జనాన్ని సమీకరించాలని కూడా సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జన సమీకరణకు గురువారం నుంచే సన్నాహాలు చేయాలని మంత్రులకు సీఎం సూచించారు. ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు, జనసమీకరణ తదితర అంశాలపై చర్చించడానికి శుక్రవారం తెలంగాణ భవన్‌లో పార్టీ శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ, రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు అధినేత కేసీఆర్ మంత్రులకు వెల్లడించారు. ఇలా ఉండగా, సమావేశంలో ముందస్తు ఎన్నికలపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. షెడ్యూల్ ప్రకారం జరిగే ఎన్నికలకు, ముందస్తు జరిగే ఎన్నికలకు మధ్య వ్యవధిలో పెద్దగా తేడా లేకపోవడంతో గడువు ప్రకారమే వెళ్లడమే ఉత్తమమని మెజారిటీ మంత్రులు అభిప్రాయపడినట్టు సమాచారం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి రావడం వందకు వంద శాతం ఖాయమని, అలాంటప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల అనవసరమని వారు అభిప్రాయపడినట్టు తెలిసింది. మంత్రుల ఆలోచనలతో అధినేత కేసీఆర్ కూడా ఏకీభవించినట్టు తెలిసింది. అయితే ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని, పార్టీ శ్రేణులను కూడా ఆ దిశగా సమాయత్తం చేయాలని కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. ప్రగతి నివేదన సభను భారీగా నిర్వహించాలని, టీఆర్‌ఎస్సే తిరిగి అధికారంలోకి రాబోతుంన్న సంకేతాన్ని ఇచ్చేలా సభను ప్రతిష్టాకరంగా తీసుకోవాలని మంత్రులకు కేసీఆర్ సూచించినట్టు తెలిసింది.