రాష్ట్రీయం

కృష్ణానదిలో మునిగి నలుగురు విద్యార్థుల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, ఆగస్టు 22: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామ సమీపంలో కృష్ణానదిలో మునిగిపోయి బుధవారం నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చిర్రావూరు గ్రామానికి చెందిన ఏడుగురు విద్యార్థులు ఒక ఆటోలో కృష్ణానది ప్రవాహాన్ని చూడటానికి గుండిమెడ ఇసుకరీచ్ వద్దకు వెళ్లారు. వీరిలో ఐదుగురు నదిలోకి దిగారు. కొద్దిసేపటికే ఒకరు తిరిగి రాగా నలుగురు విద్యార్థులు నదీ ప్రవాహ ఉద్ధృతికి గల్లంతయ్యారు. చిర్రావూరు గ్రామానికి చెందిన నీలం క్రాంతిబాబు (14), నీలం శశివర్ధన్ (10), మలబండి దినేష్ (11) , తాడికోరు శివ (14) నదిలో మునిగి మృతిచెందారు. తొలుత వీరు గల్లంతైన సమాచారం అందిన పోలీసు, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాల కోసం గాలించి వెలికితీశారు. వీరిలో శశివర్ధన్, క్రాంతిబాబు అన్నదమ్ములు. క్రాంతిబాబు, శివ 9వ తరగతి చదువుతుండగా శశివర్ధన్ నాలుగో తరగతి, దినేష్ ఐదవ తరగతి చదువుతున్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మంగళగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గంజి చిరంజీవి సంఘటనా స్థలికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు ఆర్‌డీఓ శ్రీనివాస్, డీఎస్పీ రామకృష్ణ, తాడేపల్లి తహశీల్దార్ పద్మనాభుడు సంఘటనా స్థలిలో ఉండి గల్లంతైన విద్యార్థుల మృతదేహాలను వెలికితీసే వరకు పర్యవేక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ రామకృష్ణ తెలిపారు.