రాష్ట్రీయం

విభేదాలు మానండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* 25న కర్నూలులో ధర్మపోరాటం * 28న గుంటూరులో ‘నారా హమారా’ మైనారిటీల సదస్సు
* పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి, ఆగస్టు 22: ఒంటెద్దు పోకడలు పనికిరావు.. కలసికట్టుగా పనిచేస్తేనే ఫలితాలు ఉంటాయి.. ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరగాలి.. ప్రభుత్వ, పార్టీ సేవలు సమర్థవంతంగా ఉన్నాయనే భావన కలగాలని టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్బోధించారు. బుధవారం రాత్రి ఉండవల్లి గ్రీవెన్స్ హాల్‌లో పార్టీ బాధ్యులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. గత నాలుగేళ్లుగా ప్రభుత్వ యంత్రాంగం బృందంగా పనిచేసినందు వల్లే 511 అవార్డులు సాధించ గలిగామన్నారు. ఉపాధి హామీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇంకా అనేక రంగాల్లో దేశంలోనే ముందంజలో ఉన్నామని తెలిపారు. పార్టీలో కూడా కలసికట్టుగా పనిచేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాల్లో మమేకం కావాలన్నారు. కార్యకర్తలను పురమాయించటమే కాదు వారిని శక్తివంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఎవరు ఏ విధుల్లో ఉన్నారో స్పష్టత ఉండాలన్నారు. రాష్టస్థ్రాయిలో మీడియా విశే్లషణ ప్రతిరోజు నిర్వహించినట్టే జిల్లా స్థాయిలో కూడా విశే్లషణ జరగాలని ఆయన చెప్పారు. అనుకూల, ప్రతికూల అంశాలను బేరీజు వేసుకుంటూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాసమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. ఇంకా 795 బూత్ కమిటీల కన్వీనర్ల నియామకాలు జరపలేదు.. వెంటనే భర్తీ చేయాలన్నారు. 17వేల మంది బూత్ కమిటీ కన్వీనర్లకు శిక్షణ ఇవ్వాలని, సెప్టెంబర్‌కల్లా శిక్షణా కార్యక్రమాలు పూర్తిచేయాలని ఆదేశించారు. బూత్ కమిటీ కన్వీనర్లకు బాధ్యతలు అప్పగించి పనితీరును బట్టి ర్యాంకింగ్‌తో ప్రోత్సహించాలని వివరించారు. జిల్లాలవారీగా పోలవరం ప్రాజెక్టును సందర్శించాలన్నారు. అక్కడ
జరుగుతున్న పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం సూచించారు. త్వరలోనే బూత్ కమిటీ కన్వీనర్లు, సేవామిత్రలు, పార్టీ బాధ్యులు పదివేల మందితో సమావేశం కానున్నట్టు తెలిపారు. మంత్రులు నెలలో విధిగా రెండురోజులు రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని సందర్శించి తమ శాఖల పరిధిలో సాధించిన పురోగతిపై చర్చించాలన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా పార్టీ బలహీనంగా ఉండటానికి వీల్లేదని ఆదేశించారు.
నాలుగేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో పూర్తిస్థాయి సంతృప్తి నింపి పార్టీకి అనుకూలంగా మలచుకోవటమే నాయకులు, కార్యకర్తల బాధ్యతగా ఆయన చెప్పారు. ఒకవైపు విభజన కష్టాలు, మరోవైపు కేంద్రం మిత్రద్రోహం, అన్నింటినీ అధిగమించి అభివృద్ధి సాధించటం పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెరిగిందన్నారు. ‘నువ్వే రావాలి’ కానె్సప్ట్ ప్రజల్లో విస్తృతంగా ప్రచారంలో ఉందన్నారు. దీన్ని సోషల్ మీడియాలో మరింత ముందుకు తీసుకువెళ్లాలని పార్టీశ్రేణులకు సూచించారు. ఈనెల చివరి వారంలో రెండు భారీ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని మాబు చెప్పారు. ఈనెల 25న కర్నూలులో నమ్మకద్రోహం- కుట్ర రాజకీయాలపై ‘్ధర్మపోరాట’ సదస్సు, 29న గుంటూరులో నారా హమారా- టీడీపీ హమారా మైనారిటీల సదస్సు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. వీటిని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఇది ఎన్నికల ఏడాది..మేనిఫెస్టోలో దాదాపు అన్నీ నెరవేర్చాం.. చెప్పనివి కూడా చేశాం.. అన్నీ చేశాం కదా ఇంకేమిటి అనుకోరాదు.. మనం ఎన్ని చేసినా చెయ్యాల్సినవి చాలా ఉంటాయి.. ప్రజల్లో మనపై ఇంకా ఆకాంక్షలు ఉంటాయి.. వాటన్నింటినీ వచ్చే ఆరు నెలల్లోగా నెరవేర్చాల్సి ఉందన్నారు. రానున్న 150 రోజులకు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడాలి..ప్రజలతో మమేకం కావాలి.. అన్నివర్గాల ప్రజల ఆదరాభిమానాలు పొందాలని పిలుపునిచ్చారు. ధర్మపోరాటం, గ్రామదర్శిని, గ్రామ వికాసం, జ్ఞానభేరి కార్యక్రమాలతో నిరంతరం ప్రజల మధ్య తిరుగుతున్నాం.. క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్టతపై అంతా దృష్టి సారించాలన్నారు. నాయకుల మధ్య విభేదాలు పక్కనపెట్టాలని హెచ్చరించారు. విజయం దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించాలన్నారు. ఆయా నియోజకవర్గాల్లో మహిళలు, యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, మైనారిటీ వర్గాలకు ఏంచేశామో సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్సీలు టీడీ జనార్థన్, వీవీవీ చౌదరి, కృష్ణయ్య, మాల్యాద్రి, రాజేష్, కుమార్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.