రాష్ట్రీయం

హెక్టారుకు రూ.25 వేల పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ సర్వే
* మధురపూడి విమానాశ్రయంలో అధికారులతో సమీక్ష
రాజమహేంద్రవరం, ఆగస్టు 22: వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో మళ్లీ పంట వేసుకోవడానికి వీలుగా రైతులకు పెట్టుబడి ఖర్చుల నిమిత్తం తక్షణ సాయానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మళ్ళీ వరి పంట వేసుకోవడానికి హెక్టారుకు రూ.25వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పంటనష్టం పరిహారానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. పంట మళ్ళీ వేసుకోవడానికి ఇంకా అదను ఉందని, అందుకే నష్టపోయిన పెట్టుబడిని ప్రభుత్వం అందించి రైతులను ఆదుకుంటుందన్నారు. నష్టం అంచనాలపై వారంలోగా నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు. చంద్రబాబు బుధవారం రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి హెలికాప్టర్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప, మంత్రి కెఎస్ జవహర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు కార్తికేయ మిశ్రా, కె భాస్కర్, విపత్తుల నివారణ సంస్థ కమిషనర్ గిరిధర్ ఆయన వెంట ఉన్నారు. అనంతరం మధురపూడి విమానాశ్రయంలో అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో వరద పరిస్థితులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, పశ్చిమ గోదవరి కలెక్టర్ కె భాస్కర్ ముఖ్యమంత్రికి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వరద నష్టాలు, చేపట్టిన సహాయక చర్యలను నివేదించారు.
అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రభుత్వ ఆస్తులు, పంటలకు ఏర్పడిన నష్టం రూ.600 కోట్ల వరకు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్లు మరమ్మతులకు అవసరమైన రూ.300 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. ఐదు వంతెనల మరమ్మతులకు రూ.5 కోట్ల నిధులు తక్షణం విడుదల చేస్తున్నామన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఎర్రకాల్వకు గతంలో ఎపుడూరాని విధంగా 85వేల క్యూసెక్కుల వరద జలాలు వచ్చాయన్నారు. ఈ కాల్వ వరదను చింతలపూడి ప్రాజెక్టు నుంచి పోలవరం కుడి ప్రధాన కాల్వకు మళ్ళించే విధంగా ప్రాజెక్టు చేపట్టి, పశ్చిమ గోదావరి జిల్లాలో ముంపునకు శాశ్వత పరిష్కారం పలకనున్నామన్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్లు మరమ్మతులకు రూ.35 కోట్లు మంజూరు చేశామని, పంచాయతీల్లో దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.
ఒక్క వరిపంట మాత్రమే కాకుండా దెబ్బతిన్న ప్రతీ రైతునూ ఆదుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించి నాలుగైదు రోజుల్లో నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. వరద నష్టం నివారించడంలో అధికారులు సమర్ధవంతంగా పనిచేశారని సీఎం ప్రశంసించారు. గోదావరి నది కోతకు గురవుతున్న లంక భూముల రక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. తూర్పు గోదావరి జిల్లాల్లో 43 గ్రామాలు వరద తాకిడికి ప్రభావితం
అయ్యాయని, 49 గ్రామాలు జల దిగ్బంధమయ్యాయని, 57 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా సుమారు 2600 మంది పునరావాసం పొందుతున్నారన్నారు. గర్భిణీలకు కూడా ప్రత్యేక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 6408 హెక్టార్లలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 195 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయని, 25 మండలాల్లో వరద ప్రభావం ఉందన్నారు. 104 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. 34 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయన్నారు. 550 మంది ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను ఏర్పాటుచేశామని, ఆరు శాటిలైట్ ఫోన్లు ఇచ్చామన్నారు. మొత్తం 250 ఇళ్లకు పాక్షికంగా, పూర్తిగానూ నష్టం వాటిల్లిందని, రూ.1.50 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తామన్నారు.
పోలవరం ప్రాజ్టెక్టుకు సంబంధించి 57.5 శాతం పనులు పూర్తి చేశామన్నారు. నిధులే సకాలంలో ఇవ్వనివారు పనులెలా చేస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా సీఎం అన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఐదు ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభిస్తామని, వరదల వల్ల పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడిందన్నారు.
రాష్ట్రంలో వర్షపునీటితో భూగర్భ జలాలను పెంపొందించుకునే విధంగా చర్యలు చేపట్టామని, ప్రతీ గ్రామానికి తాగునీటి సరఫరాకు స్మాల్ వాటర్ గ్రిడ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాటర్ మేనేజ్‌మెంట్‌తో వినూత్న పథకాలను తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.