రాష్ట్రీయం

దివంగత ప్రధాని వాజపేయ అస్థికల యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి చితాభస్మాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నదుల్లో నిమజ్జనం చేసే కార్యక్రమంలో భాగంగా అస్థికల కలశాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ హైదరాబాద్ తీసుకువచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నేతల కడపడి సందర్శనార్ధం అస్థికల కలశాన్ని ఉంచుతారు. 23వ తేదీన ఉదయం రెండు దిశల్లో అస్థికల నిమజ్జన యాత్ర జరుగుతుంది. వికారాబాద్ జిల్లా అనంతగిరి వైపు జరిగే యాత్రకు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ యాత్ర ప్రముఖ్‌గా ఉంటారు. నల్గొండ జిల్లా వాడపల్లివైపు జరిగే యాత్రకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీ. మురళీధర రావు యాత్ర ప్రముఖ్‌గా వ్యవహరిస్తారు. ఉదయం 11 గంటలకు అనంతగిరికి నిమజ్జన యాత్ర మొదలవుతుంది. లంగర్ హౌస్, ఆరె మైసమ్మక్రాస్ రోడ్, మొయినాబాద్, చేవెళ్ల, మనె్నగూడ, వికారాబాద్ మీదుగా అనంతగిరి చేరుకుంటుంది. మూసీబుగ్గలో అస్థికల నిమజ్జనం జరుపుతారు. ఈ యాత్రకు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి ఇన్‌చార్జిగా ఉంటారు. ఇక వాడపల్లి యాత్రకు ప్రధానకార్యదర్శి డాక్టన్ జీ. మనోహర్ రెడ్డి ఇన్‌ఛార్జిగా ఉంటారు. ఈ యాత్ర నల్గొండ క్రాస్‌రోడ్, జిల్లా కోర్టు, హయత్‌నగర్, చౌటుప్పల్, చిట్యాల , నల్గోండ, మిర్యాలగూడ మీదుగా వాడపల్లి వద్ద త్రివేణి సంగమంలో నిమజ్జనం చేస్తారు.
కేంద్ర పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేతులు అస్థికల కలశాన్ని డాక్టర్ లక్ష్మణ్ ఢిల్లీ పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ కూడా పాల్గొన్నారు. అనంతరం అస్థికల కలశాన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఆగస్టు 16న తీవ్ర అస్వస్థతతో మరణించిన వాజపేయి అస్థికలను సేకరించిన పార్టీ బుధవారం నాడు దేశంలోని అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు అందజేశారు. ఇందుకోసం పార్టీల రాష్ట్రాల అధ్యక్షులను మంగళవారం రాత్రికే ఢిల్లీ చేరుకోవల్సిందిగా జాతీయ నాయకులు ఆదేశాలు జారీ చేశారు. వీరంతా ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఉదయం సమావేశమయ్యారు. అస్థికలను వారికి అందజేయగానే ఆయా రాష్ట్రాలకు వాటిని తీసుకువెళ్లి రాష్ట్ర పార్టీ కార్యాలయాల్లో 22న ఉంచిన అనంతరం ప్రధాన నదుల్లో నిమజ్జనం చేయాలని పార్టీ సూచించింది. తెలంగాణలో చితాభస్మాన్ని 23వ తేదీన నదుల్లో నిమజ్జనం చేస్తారు. 24వ తేదీన రాష్టస్థ్రాయి సంతాప సభను నిర్వహిస్తారు. తెలంగాణలో అన్ని జిల్లాకేంద్రాల్లో సైతం వాజపేయి సంతాపసభలను నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.
బీజేపీ చీఫ్‌లకు అస్థికల కలశాలు
దేశ మాజీ ప్రధాని వాజపేయి అస్థికలను దేశంలోని అన్ని నదుల్లో నిమజ్జనం చేయడానికి చేపట్టిన ‘అస్థి కలశ యాత్ర’లో భాగంగా ఆయన ఆస్థికలు ఉన్న కలశాలను ఆయా రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షా బుధవారం అందజేశారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహార మంత్రి సుష్మాస్వరాజ్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని వంద నదుల్లో వాజపేయి అస్థికలను నిమజ్జనం చేసేందుకు ఆయా నేతలకు కలశాలను ఇచ్చినట్టు తెలిపారు. ఆయా రాష్ట్రాల్లోని నదులలో కలిపేముందు ప్రజలు మాజీ ప్రధానికి నివాళి అర్పించేందుకు వీలుగా వీటిని ఉంచుతామని అమిత్‌షా చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజధాని నుంచి బుధవారమే యాత్ర ప్రారంభమైనట్టు చెప్పారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అస్థికలశ యాత్ర జరుగుతుందని, ప్రజలు కడసారి వాజపేయికి నివాళి అర్పించవచ్చునని ఆయన ట్వీట్ చేశారు. వాజపేయికి నివాళిగా స్మతిచిహ్నాలు ఏర్పాటు చేస్తామని పలు రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని ఆయన చెప్పారు. ఇప్పటికే ఆయనకు నివాళిగా పలు యాత్రలు జరుగుతున్నాయన్నారు. కాగా, అన్ని పార్టీల వారితో ఇప్పటికే ఈనెల 20న వాజపేయి సంతాప సభను నిర్వహించామని ఆయన చెప్పారు.