రాష్ట్రీయం

మళ్లీ తెరుచుకున్న శ్రీశైలం గేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 22: శ్రీశైలం జలాశయానికి మరోమారు వరద నీటి ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు క్రష్ట్‌గేట్లను బుధవారం మళ్లీ తెరిచి దిగువ నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయానికి వరద నీటి చేరిక తగ్గుముఖం పట్టడంతో మంగళవారం మ ధ్యాహ్నం అ న్ని గేట్లను మూసివేసి కేవలం విద్యుత్ ఉత్పత్తి అనంతరం సాగర్‌కు నీరు విడుదల చేశారు. అయితే బుధవారం మధ్యాహ్నం నుంచి మళ్లీ వరద నీటి చేరిక పెరడగంతో మొదట మూడు గేట్లు, ఆ తరువాత మరో గేటు తెరిచారు. మొత్తం నాలుగు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ కృష్ణా నుంచి 1,58,408 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 67,218 క్యూసెక్కులు కలిపి మొత్తం 2,25,626 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కుడి విద్యుత్ కేంద్రం ద్వారా 32,044 క్యూసెక్కులు, ఎడమ విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు, నాలుగు క్రష్ట్‌గేట్లను ఒక్కోటి 10 అడుగుల మేర ఎత్తి 1,9,180 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,83,602 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,400 క్యూసెక్కులు, హంద్రీ-నీవా ఎత్తిపోతలద్వారా 2,363 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 24 వేల క్యూసెక్కుల నీరు కలిపి మొత్తం 28,763 క్యూసెక్కుల నీరు తాగు, సాగునీటి కోసం తరలిస్తున్నారు. జలాశయానికి 2.25 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 2.12 లక్షల క్యూసెక్కుల నీరు బయటకు పంపుతున్నారు. 13 వేల క్యూసెక్కులు జలాశయంలో నిల్వ చేస్తున్నారు.