రాష్ట్రీయం

శ్రీశైలం 8 గేట్లు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం ప్రాజెక్టు, ఆగస్టు 23: వరద పెరగడంతో గురువారం శ్రీశైలం జలాశయం 8 గేట్లు ఎత్తివేసి సాగర్‌కు భారీగా నీరు విడుదల చేస్తున్నారు. బుధవారం నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు రాత్రి మరో గేటు, ఇన్‌ఫ్లో మరింత పెరగడంతో గురువారం మరో మూడు గేట్లు ఎత్తారు. దీంతో మొత్తం 8 గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువ సాగర్‌కు 3,20,063 క్యూసెక్కుల నీరు తరలిస్తున్నారు. జూరాల నుంచి 1,69,431 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 81,174 క్యూసెక్కుల నీరు శ్రీశైలం చేరుతోంది. రెండు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ముమ్మరం చేశారు. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో 17.08 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 22.01 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 72,940 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జలాశయం బ్యాక్‌వాటర్ ద్వారా కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2400 క్యూసెక్కులు, హంద్రీనీవా ద్వారా 2,463 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 24 వేల క్యూసెక్కుల నీరు తరలిస్తున్నారు. గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి జలాశయం నీటిమట్టం 883.30 అడుగులుగా నమోదుకాగా 206.09 టీఎంసీల నీరు నిల్వ ఉంది.