రాష్ట్రీయం

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 23: దేశంలోనే అతిపెద్ద కుంభకోణమైన రాఫెల్ ఉదంతంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టనున్నట్టు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో గురువారం ఉదయం అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌చాందీ ముఖ్య అతిథిగా పాల్గొని భవిష్యత్తు ప్రణాళికలపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాఫెల్ కుంభకోణంతో పాటు నరేంద్ర మోదీ ప్రభుత్వ అవినీతి, అప్రజాస్వామ్య చర్యలను నిరసిస్తూ సెప్టెంబర్ 7 నుంచి 15వ తేదీ వరకూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలను చేపట్టి కరపత్రాలతో విస్తృత ప్రచారం చేస్తామన్నారు. అలాగే, సెప్టెంబర్ నెలాఖరులోగా
విజయవాడలో రాష్టస్థ్రాయి ఆందోళన నిర్వహించి, గవర్నర్ ద్వారా రాష్టప్రతికి వినతిపత్రాన్ని ఇవ్వాలని ఏఐసీసీ నిర్దేశించిందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని, పార్టీ గెలుపు ఆవశ్యకతను ప్రజలకు వివరించి చైతన్యపర్చాలని రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఏపీ ప్రజలు వాస్తవాలు గుర్తిస్తున్నారని, పార్టీ పై ఉన్న అపోహలు తొలగుతున్నాయన్నారు. 2019లో గెలిస్తే ఏమి చేస్తామనేది వివరించేందుకు అక్టోబర్ 2 నుంచి ఇంటింటికీ కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. సెప్టెంబర్ 18న కర్నూలులో రాహుల్‌గాంధీతో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఈ సభలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, మహిళల రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణ, జీఎస్టీ, రైతు రుణమాఫీ తదితర అంశాలపై రాహుల్ ప్రసంగిస్తారని తెలిపారు.
కేరళ బాధితులకు వెయ్యి గృహాల నిర్మాణం
ఇటీవల ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కొని అపార నష్టాన్ని చవిచూసిన కేరళ బాధితులను ఆదుకునేందుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ వివిధ సహాయక చర్యలు చేపడుతోందని రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు వరద బాధితుల కోసం ఒకొక్క ఇంటికి 5లక్షల చొప్పున వెయ్యి ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్న ఏఐసీసీ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ తరఫున విరాళాలు సేకరించి కేరళ కాంగ్రెస్‌కు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా లక్ష విలువ చేసే దుప్పట్లతోపాటు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అందించిన 5లక్షల విలువైన బియ్యాన్ని రాష్ట్ర ఇన్‌చార్జి ఊమెన్ చాందికి రఘువీరారెడ్డి అప్పగించారు.

చిత్రం..కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి