రాష్ట్రీయం

అభివృద్ధిలో రాజకీయాలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 23: భారతదేశ రెండో అత్యున్నత రాజ్యంగపరమైన ఉప రాష్టప్రతి పదవి, రాజ్యసభ చైర్మన్ పదవిల ప్రతిష్టను మరింతగా ఇనుమడింప చేసేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తానని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి కోసం అందరూ కలిసి పాటుపడాలన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నికల ప్రచారమేకాదు చివరకు ఎన్నికల్లో నామినేషన్ ఫీజు కోసం కూడా ఏనాడూ ఇంటి నుంచి ఒక రూపాయి తీసుకురాలేదని అలాగే ఏనాడూ కూడా ఇంటికి రూపాయి తీసుకెళ్లలేదన్నారు. ఏమైనా మిగిలితే పార్టీ కోసమే వెచ్చించానని అన్నారు. దీని కంతటికీ విద్యార్థి దశ నుంచి తోడుగా వచ్చిన స్నేహితుల అండదండలే తన బలమని, అలాగే వారు కూడా ఏనాడూ తన నుంచి ఏమీ ఆశించలేదన్నారు. ఉప రాష్ట్రపతి గా ఏడాది పదవీకాలం ముగిసిన సందర్భంగా స్థానిక హోటల్ గేట్ వేలో గురువారం రాత్రి ఏర్పాటైన ‘ఆత్మీయ సమావేశం’లో నాయుడు ప్రసంగించారు. మధ్యమధ్యలో తనదైన శైలిలో చలోక్తులు విసిరారు. ఉప రాష్టప్రతి పదవి కాదుకదా నాటి నుంచి కూడా తాను ఏనాడూ ఏ ఒక్క పదవి ఆశించలేదని అయితే అందివచ్చిన పదవులకు తగు న్యాయం చేశాననే సంతృప్తి ఉందన్నారు. నేడు టీడీపీతో పొత్తు లేకపోయినా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రోడ్డెక్కితే ఎన్టీఆర్‌ది నాది ఒకే కులమన్నారు. అదే నిజమైతే నాదెండ్ల తన కులం మనిషి కాదా అని పరోక్షంగా
ప్రస్తావించారు. ఏదిఏమైనా అదో చారిత్రాత్మక ఘట్టమన్నారు. వాజపేయి హయంలో కేంద్ర, గ్రామీణాభివృద్ధిలో గ్రామీణ సడక్ యోజన పేరిట గ్రామాల్లో రోడ్లు వేయించడం, మోదీ హయాంలో వారసత్వ, ఆకర్షణ నగరాలు పేరిట పోటీ, స్వచ్ఛ్భారత్ ఈ రాష్ట్రానికి ఆరున్నర లక్షల గృహాల మంజూరు తనకెంతో సంతృప్తినిచ్చాయని అన్నారు. స్థానిక సంస్థలు తమంతట తాముగా పరిపుష్టి చెందాలి కానీ ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడరాదన్నారు. ప్రకృతిని గౌరవించకుండా చెరువులు, కాలువలు, నదులను ఆక్రమించుకున్న ఫలితంగానే నేడు ప్రకృతి మనతో చెలగాటమాడుతున్నదంటూ కేరళ విపత్తును గుర్తు చేశారు. ఉప రాష్ట్రపతిగా ఇప్పటికీ 56 విశ్వ విద్యాలయాలను సందర్శించానని, ఇతర విశ్వవిద్యాలన్నింటినీ సందర్శించి విద్యార్థులతో మమేకం కానున్నానని వెంకయ్య నాయుడు అన్నారు. ప్రస్తుతం రాజ్యసభ సమావేశాలు సాఫీగా జరగటంలేదనే బాధతో కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించాల్సి వస్తున్నదన్నారు. ప్రభుత్వం పాలన చేయాలి, ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వాలి... ఎన్నికల్లోనే విమర్శలు ఉండాలని అన్నారు. పొరుగునున్న తమిళనాడులోని రాజకీయ పరిస్థితి క్రమేణ ఏపీకి తరలివస్తున్నదంటూ అక్కడ కరుణానిధి హయాంలో బయలలిత, ఆమె హయాంలో కరుణానిధి సభలోకి అడుగుపెట్టలేదని పైగా చావు, పుట్టుక సందర్భాల్లోనూ ఒకరు స్వర్గలోకానికి వెళ్లి మరొకరు నరక లోకానికి వెళ్లడానికి కూడా సిద్ధమయ్యే శతృత్వం ఎందుకని ప్రశ్నించారు. రాజకీయ బాధలు ఉండవచ్చుకాని బద్ధవైరం ఎందుకుని నాయుడు ప్రశ్నించారు. వీరమాచినేని రంగ ప్రసాద్ సభ నిర్వహించారు. సభానంతరం నాయుడు ప్రతి ఒక్కరి దగ్గరకెళ్లి చిరునవ్వుతో పలుకరించి ముచ్చటించారు. వివిధ రంగాల ప్రముఖులు, ఉన్నతాధికారులు, విద్యావేత్తలు హాజరయ్యారు.

చిత్రం..ఆత్మీయ సమావేశంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య