రాష్ట్రీయం

కేసీఆర్‌ది ముందుచూపే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారా? తాజా పరిణామాలు ఈ అంశాన్ని ధ్రువీకరిస్తున్నాయా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేకపోయినా, జరుగుతున్న పరిణామాలు మాత్రం ఈ సంకేతాలనే ఇస్తున్నాయ. గురువారం హైదరాబాద్‌లో గవర్నర్‌తో సీఎం భేటీ కావడం, ఢిల్లీలో ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసాతో సమావేశం కావడం ముందస్తు ఊహాగానాలకు బలాన్నిస్తున్నాయి. శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిపించేందుకు గల సాధ్యాసాధ్యాల గురించి అశోక్ లావాసాతో రాజీవ్ శర్మ చర్చించినట్టు తెలిసింది. ఆయనతోపాటు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి కేఎం సహానీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావాలని కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులకు పిలుపిచ్చిన మరుసటిరోజే ఇద్దరు సీనియర్ అధికారులు ఢిల్లీకి వచ్చి కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ సంవత్సరం డిసెంబర్‌లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరాం శాసనసభలకు జరిగే ఎన్నికలతోపాటు తెలంగాణ శాసనసభకు కూడా ఎన్నికలు జరిపించేందుకు వీలుంటుందా లేదా? జరిపించాలనుకుంటే రాష్ట్ర శాసనసభను ఎప్పుడు రద్దు చేయాలి? ఇతరత్రా పాటించవలసిన నియమాలేమిటి అనే అంశాలపై రాజీవ్ శర్మ, సహానీ ఎన్నికల కమిషనర్‌తో చర్చించారని అంటున్నారు. అనంతరం వారిద్దరూ కేంద్ర అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను కూడా కలుసుకున్నట్లు సమాచారం. సుప్రీం కోర్టులోని వేణుగోపాల్ చాంబర్‌లో ఈ సమావేశం జరిగిందని అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరపడం ఇష్టం లేదని అంటున్నారు. రెంటికీ ఒకేసారి ఎన్నికలు జరిగితే తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందనే అభిప్రాయంతోనే కేసీఆర్ శాసనసభ ఎన్నికలను ఐదు నెలల ముందు జరిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. అయితే, లోక్‌సభతోపాటు జరపవలసిన తెలంగాణ శాసనసభ ఎన్నికలను ముందుకు జరిపేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆమోదిస్తారా అనేది ప్రశ్న. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను వీలున్నంతవరకు కలిపి జరిపించటం ద్వారా ఎన్నికల ఖర్చు తగ్గించుకోవటంతోపాటు అభివృద్ధి పథకాల అమలుపై దృష్టి కేంద్రీకరించవచ్చునని వాదిస్తున్న నరేంద్ర మోదీ తెలంగాణ శాసనసభ ఎన్నికలను గడువుకంటే ఐదు నెలల ముందుకు జరిపేందుకు అంగీకరిస్తారా? అనేది వేచిచూడాల్సిందే. తెంలగాణ రాష్ట్ర ఓటర్ల తుది జాబితా 2019 జనవరి నాటికి గానీ పూర్తికాదు. తెలంగాణ శాసనసభ ఎన్నికలను డిసెంబర్‌లో జరిపించుకోవాలంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను నవంబర్ నాటికి పూర్తి చేసుకోవలసి ఉంటుంది. రాజీవ్ శర్మ గురువారం లవాసాను కలిసినప్పుడు ఓటర్ల జాబితా గురించి కూడా చర్చించారనే మాట వినిపిస్తోంది. మొత్తానికి ఈ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.