రాష్ట్రీయం

నిత్య యవ్వనం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: జీవచక్రాన్ని నిలిపివేయవచ్చా.... అంటే మనిషి యవ్వనాన్ని చివరి వరకూ కొనసాగించవచ్చా? ఇది అసాధ్యంగా కనిపించినా, శాస్తవ్రేత్తలు మాత్రం సాధ్యమే అంటున్నారు. అయితే ఈ దిశగా మరిన్ని ప్రయోగాలు జరగాల్సి ఉందని స్పష్టం చేస్తున్నారు. వయస్సు మీద పడకుండా ఆపగలిగే పరిస్థితులు మున్ముందు ఉంటాయని వారు విశ్వసిస్తున్నారు. ఎప్పటికీ యవ్వనం అసాధ్యమేమీ కాదని, మరింత విస్తృత పరిశోధనలతో దానిని సాధించవచ్చని, అయితే అదే పరిస్థితుల్లో పర్యావసానాలను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుందని వారి వాదన. హైదరాబాద్ ఐఐటీ గత రెండు రోజులుగా నిర్వహించిన వర్కుషాప్ సందర్భంగా హాజరైన శాస్తవ్రేత్తలు ఈ అంశాన్ని చెబుతున్నారు. ‘జీవగడియారం పున:నిర్మాణం’ అనే అంశంపై ఈ వర్కుషాప్‌ను నిర్వహించారు. డాక్టర్ అందిత మజుందర్, ఉత్తర భారత గ్రామీణ ప్రాంతాల్లో వయస్సు పెరగడంపైనా, ఐవీఎఫ్‌పైనా పరిశోధనలు నిర్వహిస్తున్నారు. పిల్లలున్న దంపతులతో ఆమె పలు ఇంటర్వ్యూలను నిర్వహించినపుడు వారి కృత్రిమ గర్భధారణ, పిల్లలు అంశంపై ఆసక్తికరమైన సమాచారాన్ని సేకరించారు. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి, ఒక ప్రత్యేక జర్నల్‌లో పరిశోధనాత్మక వ్యాసం రాయాలని ఈ వర్కుషాప్‌లో
నిర్ణయించారు. పర్యావరణ విషపూరిత అంశాలు, శారీరక మార్పులుపై సాంక్రమిక రోగ నిర్ధారణ నిపుణులు, సామాజిక శాస్తవ్రేత్తలతో కూడిన బృందం సంయుక్త పరిశోధన నిర్వహించడం వల్ల మరిన్ని ఫలితాలను రాబట్టవచ్చని వర్కుషాప్‌లో తీర్మానించారు. ఈ సందర్భంగా కేంబ్రిడ్జి యూనివర్శిటీ డిపార్టుమెంట్ ఆఫ్ సోషియాలజీ రీ ప్రొడక్టివ్ సోషియాలజీ గ్రూప్‌నకు చెందిన డాక్టర్ లూసీ వాన్ డీ విల్ ఈ వర్కుషాప్‌లో మాట్లాడుతూ మెక్సికో, యూఎస్, యూకే తదితర దేశాల్లో పునరుత్పత్తి నిర్వహణ తీరు భిన్నంగా, ఎంతో ఆసక్తి కలిగించేదిగా ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో పునరుత్పత్తి పద్ధతుల్లో అనేక మార్పులు సంభవించే అవకాశం ఉందని, మరీ ముఖ్యంగా మెక్సికో, జపాన్, యుఎస్, యుకే, డెన్మార్కు, ఇండియా, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఈ మార్పు ఎక్కువగా కనిపించనుందని జోస్యం చెప్పారు. కాగా, యుకేకు చెందిన వెల్కమ్ ట్రస్టు ఈ పరిశోధనలకు ఏర్పాట్లు చేస్తోంది.

చిత్రం..వర్క్‌షాప్‌లో పాల్గొన్న ప్రొఫెసర్లు